Viral video : వీడెవడ్రా బాబూ.. పెద్దపులితో రోడ్ మీదకు షికారుకొచ్చిన సోగ్గాడు
పులితో రోడ్డుమీదకు షికారుకొచ్చాడో సోగ్గాడు. ఆ పులి ఊరికే ఉంటుందా ఏంటీ.. దారి వెంట వెళ్లే వాహనాలను చూసి..

man walk With tiger on road
man walk With tiger for on road : చాలామంది కుక్కలు పెంచుకుంటుంటారు.వాటిని రోజు వాకింగ్ కు తీసుకెళుతుంటారు.పెంపుడు జంతువులతో షికార్లకు వెళుతుంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం కుక్క అయితే కిక్కేముంటుంది..? అనుకున్నాడో ఏమోగానీ ఏకంగా పెద్దపులితో కలిసి రోడ్డు మీదకు షికారుకొచ్చాడు. ఏదో చిన్న కుక్కపిల్లను తీసుకొచ్చినట్లుగా ఏకంగా పెద్దపులిని తీసుకుని షికారుకొచ్చాడు. పైగా అది బిజీగా ఉండే రోడ్డుమీద పులితో షికార్లు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
బిజీగా ఉండే రోడ్డుమీదకు పెద్దపులిని షికారుకు తీసుకొచ్చాడో యువకుడు. పైగా అది వాహనాలు రయ్ మంటూ దూసుకెళిపోయే రద్దీగా ఉండే రోడ్డు. ఓ పెద్దపులి మెడకు ఓ బెల్ట్ కట్టి..దానికి తాడు కట్టి పులితో కలిసి రోడ్డుపైకి వచ్చాడు. మరి ఆ పులి ఊరికే ఉంటుందా ఏంటీ..రోడ్డు వెంట వెళ్లే వాహనాలపైకి దూకేందుకు యత్నించింది. అతగాడు పులి మెడలో తాడును పట్టుకుని ఆపుతున్నాడు. ఆ సమయంలో అతను నవ్వుతు పులిని కంట్రోల్ చేస్తున్నట్లుగా ఈ వీడియోలో కనిపిస్తోంది.
రోడ్డుమీద రయ్ మంటూ దూసుకుపోతున్న వాహనాలను ఆ పులి ఆసక్తిగా చూస్తు వాటిపై దూకేందుకు ట్రై చేయటం పులిని అతగాడు పట్టుకుని ఆపటం..ఆ రోడ్డు పక్కనే ఉన్న ఓ వ్యక్తి ఇదంతా ఆసక్తిగా చూడటం ఈ వీడియోలో కనిపిస్తోంది.
కాగా..ఈ దృశ్యం పాకిస్తాన్ లో జరిగినట్లుగా తెలుస్తున్న ఈ వీడియో ‘టిప్ టాప్’ అనే ిన్ స్టా గ్రామ్ ఖాతో అప్ లోడ్ చేశారు. పులితో రోడ్డుమీదకు వాకింగ్ రావటం ఏంటిరా అనేలా ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
View this post on Instagram