Youtuber Salary: యూట్యూబర్ సంపాదన నెలకు రూ.95లక్షలా..

పాపులర్ యూట్యూబర్ భువన్ బాం శాలరీ ఊహించని రేంజ్ లో ఉంది. 10మిలియన్ మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించిన ఈ యూట్యూబర్ రెవెన్యూ నెలకు రూ.95లక్షలు.

Youtuber Salary: యూట్యూబర్ సంపాదన నెలకు రూ.95లక్షలా..

New Project

Updated On : October 11, 2021 / 8:24 PM IST

Youtuber Salary: పాపులర్ యూట్యూబర్ భువన్ బాం శాలరీ ఊహించని రేంజ్ లో ఉంది. 10మిలియన్ మంది సబ్‌స్క్రైబర్లను సంపాదించిన ఈ యూట్యూబర్ రెవెన్యూ నెలకు రూ.95లక్షలు. కొన్నిషార్ట్ ఫిలింస్ తో పాటు మ్యూజిక్ ఆల్బమ్స్ చేసి మొత్తం ఆదాయం రూ.22కోట్లకు చేరుకున్నాడు.

ఆదాయ వనరుల్లో దాదాపు BB ki Vines యూట్యూబ్ ఛానెల్ నుంచే ఎక్కువ సంపాదిస్తున్నాడు భువన్. అతనికి నెలకు వచ్చే జీతం రూ.95లక్షల్లో స్పాన్సర్ షిప్ లు కూడా ఉన్నాయి. అంతేకాదు Myntraకు డిజిటల్ బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అయిన భువన్ డీల్‌కు రూ.5కోట్లు తీసుకున్నాడు.

Mivi బ్రాండ్ ద్వారా ఏటా రూ.4కోట్లు సంపాదిస్తున్నాడు. మొత్తంగా ప్రస్తుతం Arctic Fox, Beardo, Lenskart, Mivi, Tissot, Tasty treatsకు అడ్వర్టైజింగ్ చేస్తున్నాడు.

……………………………………………. : 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి

న్యూ ఢిల్లీలోని గ్రీన్ ఫీల్డ్స్ స్కూల్‌లో స్కూలింగ్, షహీద్ భగత్ సింగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాడు. 2014లో తొలి వీడియో బాగా వైరల్ అయింది. వైరల్ ఫీవర్ అనే వెబ్ సిరీస్ లో కూడా కనిపించాడు భువన్.