Amma Vodi : 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి ​

75 శాతం హాజరు ఉంటేనే అమ్మ ఒడి పథకం నగదు జమ చేయాలనీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

Amma Vodi : 75 శాతం హాజరు ఉంటేనే అమ్మఒడి  ​

Andhra Pradesh (2)

Updated On : October 11, 2021 / 7:08 PM IST

Amma Vodi :ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని తెచ్చిన పథకం అమ్మఒడి. ఈ పథకం కింద ప్రతి విద్యార్థికి రూ. 15,000 ఆర్ధిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. ఈ మొత్తం విద్యార్థి తల్లి ఖాతాలో జమ అవుతోంది. ఈ పథకానికి సంబందించిన విధివిధానాలను మొదట్లోనే తెలిపింది ప్రభుత్వం. తెల్లరేషన్ కార్డుతో పాటు 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు మాత్రమే ఈ పథకం వర్తిస్తోంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం హాజరుపై దృష్టిపెట్టలేదు.. కరోనా కారణంగా పాఠశాలలు మూతపడటంతో హాజరు శాతాన్ని పక్కన పెట్టి.. విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసింది.

Read More : Andhra Pradesh : కరెంట్ కోతలు తప్పవ్..ఎంత తక్కువ వాడితే అంత మంచిది : మంత్రి సజ్జల

ఇక ఇప్పటి నుంచి 75 శాతం హాజరు ఉన్న విద్యార్థులకు మాత్రమే అమ్మఒడి నగదు జమచేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో పాఠశాలల నిర్వహణ, అమ్మఒడి, విద్యాకానుక వంటి అంశాలపై విద్యాశాఖ ఉన్నతాధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్బంగా 2024 నాటికి విద్యార్థులు సీబీఎస్‌ఈ పరీక్షలు రాసే దిశగా ముందుకు సాగాలన్నారు. ఎయిడెడ్ స్కూళ్లను విలీనం విషయంలో బలవంతం చేయట్లేదనే విషయాన్నీ స్వష్టంగా చెప్పాలన్నారు. ఎయిడెడ్‌ యాజమాన్యాలు అప్పగిస్తే ప్రభుత్వమే పాఠశాలలను నడుపుతుందని తెలిపారు.

Read More : Andhra Pradesh : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు