Andhra Pradesh : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన హెల్త్ బులెటిన్ ప్రకారం…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 800 కరోనా కేసులు నమోదయ్యాయి.

Andhra Pradesh : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

Andhra pradesh

Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. నిన్న తగ్గిన కరోనా కేసులు ఇవ్వాళ మళ్లీ పెరిగాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన హెల్త్ బులెటిన్ ప్రకారం…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 800 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,54, 663 కి పెరిగింది.

Read More :  కాలేజీలు, యూనివర్సిటీల్లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉండొద్దు – సీఎం జగన్

మంగళవారం ఉదయం 10 గంటల నుంచి బుధవారం ఉదయం 10 గంటల వరకు 09 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14,228 కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో 1178 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20,31, 681 లక్షలకు చేరింది.

Read More : Chandrababu : రెండున్నరేళ్లలో అభివృద్ధి జాడేలేదు,ఏపీలో ఎక్కడ చూసినా విధ్వసం,రాక్షస పాలనే . చంద్రబాబు

ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 46, 558 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 85, 64 , 548 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8754 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి.