Chandrababu : రెండున్నరేళ్లలో అభివృద్ధి జాడేలేదు,ఏపీలో ఎక్కడ చూసినా విధ్వసం,రాక్షస పాలనే: చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీలో అభివృద్ధి జాడ అనేదే లేకుండా పోయిందని ఎక్కడ చూసినా విధ్వంసం తప్ప ఏమీ లేదని..రాక్షసపాలతో ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోందని చంద్రబాబు విమర్శించారు.

Chandrababu : రెండున్నరేళ్లలో అభివృద్ధి జాడేలేదు,ఏపీలో ఎక్కడ చూసినా విధ్వసం,రాక్షస పాలనే: చంద్రబాబు

Chandrababu criticism of CM Jagan’s Govt : వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏపీలో అభివృద్ధి జాడ అనేదే లేకుండా పోయిందని ఎక్కడ చూసినా విధ్వంసం తప్ప ఏమీ లేదని..రాక్షస పాలతో ప్రభుత్వం ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోందని మాజీ సీఎం,టీడీపీ అధినేత నారా చంద్రబాబు విమర్శలు సంధించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం టీడీపీ నేతలతో భేటీ అయిన సందర్భంగా చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక..గత రెండున్నరేళ్లలో ఎక్కడ చూసినా విధ్వసం, రాక్షస పాలనే తప్ప మరేమీ లేదని..ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు బనాయించి వారి నోళ్లు మూయించేస్తున్నారని విమర్శించారు.

Read more : Boy plays with snake : రెండేళ్ల బుడ్డోడు 12 అడుగుల పాము తోక పట్టుకుని ఆటలు..

పాలన అనేదే లేకుండా కేవలం కక్ష సాధింపు చర్యలనే ఎజెండాగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని అన్నారు. సంక్షేమం అని చెబుతు ప్రజల్నీ వనరుల్ని పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నారని అన్నారు.ప్రభుత్వాన్ని ప్రశ్నించినా..విమర్శించినా..అక్రమ కేసులతో నోళ్లు మూయించేసే దాదాగిరీలో ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందని అన్నారు.అభివృద్ధి లేకపోవటంతో ఒక్కరూపాయి ఆదాయం లేక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నేతల్ని టార్గెట్ చేస్తు భయపెట్టాలని చూస్తున్నారని..టీడీపీ దేనికి..ఎవ్వరికి భయపడదనే విషయం వైసీపీ పార్టీ నేతలు.సీఎం జగన్ గుర్తు పెట్టుకోవాలని..ఇటువంటివి చాలానే చూశాం.పాలన చేయటం మానేసి కక్ష సాధింపుతోనే టీడీపీని అణచివేయాలని చూస్తే అది జరిగేపనికాదనే విషయం తెలుసుకోవాలని అన్నారు.

Read more : సీఎం జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ

రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సీడీ, పంట నష్టం పరిహారాలు ఇవ్వట్లేదని రైతుల ఉసురు పోసుకున్న ఏ ప్రభుత్వాలు నిలవలేదని విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. రైతుల కష్టాలు ప్రభుత్వానికి ఏమాత్రం పట్టటంలేదని..కానీ అదిచేస్తున్నాం. ఇది చేస్తున్నాం అంటూ ప్రచార ఆర్భాటం మాత్రం చేసుకుంటున్నారని చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని ఊబిలో ముంచేస్తు ప్రజలపై భారాలు మోపుతున్నారని అప్పుల బాధ తాళలేక రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి నెలకొంది వైసీపీ ప్రభుత్వంలోనని విమర్శించారు.

ప్రజల చేతిలో జగన్ కు ఎదురు దెబ్బ తప్పదని..జగన్ కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ప్రభుత్వంపై న్యాయస్థానాలు ఎన్ని రకాలుగా మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో ఏమాత్రం మార్పులేదని పైగా గూండాల్లా వ్యవహరిస్తు న్యాయమూర్తుల్ని, న్యాయస్థానాలపై కూడా ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు.ఉపాధి హామీ పెండింగ్ బిల్లుల చెల్లింపు విషయంలో ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బుల కోసం టీడీపీ ప్రజలకు అండగా ఉండి చివరి వరకూ పోరాడి విజయం సాధించిందని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.ప్రభుత్వం పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడంలేదు. రూ.70 వేల కోట్ల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉన్నా ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వారిని ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్శించారు.

ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారం మోపుతు ప్రజల రక్తాన్ని పీల్చే జలగలాగా జగన్ ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.ఆదాయం కోసం ప్రభుత్వమే మద్యాన్ని ప్రజలతో బలవంతంగా తాగించే పరిస్థితికి దిగిజారిపోయిందని ఎద్దేవా చేశారు.లిక్కర్ పై రూ. 75వేల కోట్లు అప్పు చేసి..జగన్ ప్రభుత్వం ఆడబిడ్డల తాళిబొట్లతో ఆడుకుంటోందని..ఆడబిడ్డల ఉసురు ఈ ప్రభుత్వానికి తగిలి తీరుతుందని అన్నారు. ప్రభుత్వమే సొంతంగా మద్యం తయారుచేస్తు మద్యం వ్యాపారిలా మారిందనీ..సిరకం బ్రాండ్లతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతిస్తూ ప్రజల రక్తాన్ని పీలుస్తు దోపిడీ చేస్తోందన్నారు.

Read more : Andhra Pradesh : ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు

ఏపీని డ్రగ్స్ కు కేంద్రంగా మార్చేసిన ఘనత సీఎం జగన్ కే చెల్లుతుందని ఎద్దేవా చేశారు. ఏపీని గంజాయి, హెరాయిన్ అడ్డాగా మార్చేశారని విమర్శలు సంధించారు. ఏపీని డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు టీడీపీ ఆధ్వర్యంలో కార్యక్రమం చేపడతామని చంద్రబాబు తెలిపారు. యువత మత్తు పదార్థాల బారిన పడకుండా మావంతు కృషిచేస్తామన్నారు.జగన్ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారింది.దోచుకోవడానికి, దాచుకోవడానికే అప్పులు చేస్తున్నారు. సంపద సృష్టి ఎక్కడా మచ్చుకు కూడా కనిపించటలేదు.వైసీపీ నేతల అవినీతిని బట్టబయలు చేస్తాం.ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ రెడ్డి గెలిచే పరిస్థితి లేదు.ఉత్తరాంధ్రను పూర్తిగా నాశనం చేశారు. సాగునీటిని సక్రమంగా వినియోగించుకునే పరిస్థితి లేదు.విశాఖను భూకబ్జాలకు నిలయంగా మార్చారు. అప్పుల కోసం విలువైన, చారిత్రక భవనాలను తాకట్టుపెడుతున్నారని చంద్రబాబు వివరించారు.

Read more : Visakha Airport : విశాఖ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ల కలకలం

రాజధాని అమరావతిని నాశనం చేసి పంట పొలాలు ఇచ్చిన కుటుంబాల్లో చిచ్చు పెట్టారని ఆడబిడ్డల్ని నడిరోడ్డుమీద నిలబెట్టిన ఘనత సీఎం జగన్ కు మాత్రమే దక్కుతుందని అన్నారు. అభివృద్ధి అనేదే లేక యువతకు ఉద్యోగాలు లభించడం లేదు. ఇటువంటి ఎన్నో సమస్యలకు ఏపీని నిలయంగా మార్చేశారని..ఈ సమస్యలపై తెలుగుదేశం పోరాడుతుందని తెలిపారు.తెలుగుదేశం పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం జరిగితే ఇప్పుడు జగన్ రెడ్డి పాలనలో విధ్వంసం రాక్షస పాలన మాత్రమే ఉందని అన్నారు.