Visakha Airport : విశాఖ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ల కలకలం

విశాఖ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం రేగింది. మహిళ హ్యాండ్ బ్యాగులో గన్ బుల్లెట్లు లభ్యమయ్యాయి. విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు వచ్చిన మహిళ బ్యాగ్‌లో 13 బుల్లెట్లను గుర్తించారు.

Visakha Airport : విశాఖ ఎయిర్‌పోర్టులో బుల్లెట్ల కలకలం

gun bullets in a woman’s handbag : విశాఖ విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం రేగింది. మహిళ హ్యాండ్ బ్యాగులో గన్ బుల్లెట్లు లభ్యమయ్యాయి. విశాఖ నుంచి హైదరాబాద్‌ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చిన మహిళ బ్యాగ్‌లో 13 గన్‌ బుల్లెట్లను అధికారులు గుర్తించారు. వెంటనే ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసులకు సమాచారం అందించారు.

ఇమిగ్రేషన్ తనిఖీల్లో భాగంగా మహిళ బ్యాగ్‌లో బుల్లెట్లు గుర్తించారు. ఆమె నుంచి 13 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మహిళ బుల్లెట్లను ఎందుకు తీసుకెళ్తోంది..? ఎవరికైనా ఇచ్చేందుకు తీసుకెళ్తోందా..? అనేదానిపై ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసులు, అధికారులు ఆరా తీస్తున్నారు.

Suspicious Death : విశాఖలో బాలిక అనుమానాస్పద మృతి

నగరంలోని బీచ్‌రోడ్డులో ఉండే టి.సుజాత (73) ఇటీవల ఇల్లు ఖాళీ చేసి, హైదరాబాద్‌లో ఉండే తన కుమారుడి ఇంటికి వెళ్లి పోయారు. ఇంట్లో మిగిలిన సామాన్లు తీసుకెళ్లేందుకు రెండు రోజుల క్రితం ఆమె విశాఖకు వచ్చారు. తాజాగా హైదరాబాద్‌ వెళ్లేందుకు ఫ్లైట్ టిక్కెట్స్ బుక్ చేసుకున్నారు. అయితే బోర్డింగ్‌ టైమ్‌లో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ఆమె బ్యాగ్‌ ను తనిఖీ చేయగా 13 రౌండ్ల బుల్లెట్లు బయటపడ్డాయి.

అయితే తన పెదనాన్నకు తుపాకీ లైసెన్స్ ఉండేదని, ఇటీవలే ఆయన మరణించారని ఆమె పోలీసులకు తెలిపారు. ఆయన బ్యాగ్‌లోనే తన సామగ్రిని పెట్టుకొని వెళ్తున్నానని, అందులో బుల్లెట్లు ఉన్నట్లు తనకు తెలియదని ఆ వృద్ధురాలు చెప్పారు. అయితే ఆమె వద్ద అందుకు సంబంధించి ఎలాంటి లైసెన్స్, డాక్యుమెంట్స్ లేకపోవడం గమనార్హం. దీంతో విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ పోలీసుస్టేషన్‌లో ఆ వృద్ధురాలిపై కేసు నమోదైంది.