Zainab Maths Notebook : కూతురు మార్కుల షీటుపై అమ్మ రాసిన మాటలు వైరల్

ఓ అమ్మ తన కూతురుకు వచ్చిన మార్కులు చూసి స్పందిస్తు ఆమె పుస్తకంలో రాసిన కొన్ని వాఖ్యాలు వైరల్ అవుతున్నాయి.

Zainab Maths Notebook : కూతురు మార్కుల షీటుపై అమ్మ రాసిన మాటలు వైరల్

Zainab Maths Notebook Mother Comments

Updated On : August 29, 2023 / 1:20 PM IST

Zainab Maths Notebook : పరీక్షలు వచ్చాయంటే చాలు విద్యార్ధులు పుస్తకాలు ముందేసుకుని తెగ కసరత్తులు చేస్తుంటారు. మరీ ముఖ్యంగా మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందంటే ఇక వారి తిప్పలు మామూలుగా ఉండవు. చాలామంది విద్యార్ధులకు మ్యాథ్స్ అంటే చాలా భయపడుతుంటారు. పరీక్షలు అయ్యాక చూసుకుంటే మ్యాథ్స్ లో బండి సున్నా (సున్నా)వస్తే వామ్మో ఇంకేముంది..? అమ్మ కొట్టేస్తుంది..నాన్న వీపు విమానం మోత మోగించేస్తాడు అని భయపడిపోతుంటారు. అలాగే భయపడింది ఓ అమ్మాయి. ఆ అమ్మాయికి పరీక్షల్లో మ్యాథ్స్ లో 15 మార్కులకు గుండు సున్నా వచ్చింది. అందరు పిల్లల్లాగే పాపం ఆ అమ్మాయి కూడా భయపడిపోయింది. కానీ వాళ్లమ్మ మాత్రం తన కూతురు మార్కుల షీటు( Note book)పై కొన్ని వ్యాఖ్యాలు రాసింది. ఆ అమ్మ రాసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలను బాగా చదవాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలి. క్లాస్ ఫస్ట్ రావాలి అని ఒత్తిడి చేస్తుంటారు. కానీ ఎంతమంది తల్లిదండ్రులు మంచి మార్కులు రాకపోయినా ఫరవాలేదు..తక్కువ మార్కులు వస్తే భయపడవద్దు.. అని ధైర్యం చెప్పేవాళ్లు ఉంటారు? అంటే కాస్త ఆలోచించాల్సిందే. కానీ ఓ తల్లి మాత్రం తన కూతురుకు లెక్కల్లో జీరో మార్కులు వచ్చినా కూతురుపై కోప్పడలేదు. కానీ తన కూతురుతో పాటు అందరు ఆలోచించేలా కూతురు నోట్ బుక్కులో కొన్ని వాఖ్యాలు రాసింది.

Expensive Porcelain Bowl : చిన్న పింగాణి గిన్నె ధర అక్షరాలా రూ. కోటి, దాని ప్రత్యేక ఏంటో తెలుసా..?

జైనాబ్‌ (zainab)అనే యువతి ట్విటర్‌లో తన మార్కుల షీటును షేర్ చేస్తు ‘‘రూమ్‌లో నా ఆరో తరగతి లెక్కల పుస్తకం (Maths Notebook) కనిపించింది. అందులో లెక్కల్లో 15 మార్కులకు సున్నా వచ్చింది. ఆ రోజు అమ్మ నన్ను కొట్టలేదు. నా మార్కులను చూసి.. డియర్‌ ఈ మార్కులు అంగీకరించాలంటే ధైర్యం కావాలి. నీకు చాలా ధైర్యం ఉంది అని రాసింది. అమ్మ ప్రోత్సాహంతో తర్వాత నుంచి లెక్కల్లో మంచి మార్కులు తెచ్చుకున్నాను. మీ పిల్లలకు తక్కువ మార్కులు వచ్చాయని కోపం తెచ్చుకోకుండా ఉంటే కచ్చితంగా వారి దగ్గర నుంచి మంచి ఫలితాలు వస్తాయి’’ అని పేర్కొంది. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పిల్లలకు తక్కువ మార్కులు వచ్చాయని కోప్పడితే వారు మరింత కృంగిపోతారు. అలాకాకుండా వారికి చక్కగా ధైర్యం చెబితే మరో పరీక్షలో చక్కటి మార్కులు తెచ్చుకుంటారు. గెలుపుని అభినందించటం గొప్ప కాదు అది అందరు చేసేదే. పరిచయం ఉన్నవారు లేని వారు కూడా గెలుపుని అభినందిస్తారు. కానీ ఓటమిపాలైనప్పుడు ధైర్యం చెప్పేవారు, ప్రోత్సహించేవారు ఓటమితోనే గెలుపు మొదలవుతుందని ఉత్సాహపరిచేవారు కొంతమందే ఉంటారు. అటువంటివారే నిజమైన శ్రేయోభిలాషులు. ఇదే విషయాన్ని ప్రతీ తల్లిదండ్రులు గుర్తించాలని తమ పిల్లలకు తక్కువ మార్కులు వచ్చాయని..పరీక్షల్లో ఫెయిల్ అయ్యాయరని కోప్పడకూడదని ఆ సమయంలో వారికి ధైర్యమిస్తే ఇదిగో ఈ జైనాబ్ లా పట్టుదలగా మంచి ఫలితాలు సాధిస్తారని గుర్తించాలి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వ్యాఖ్యలు కూడా అదే విషయాన్ని చెబుతున్నాయి. ఆ తల్లి తన కూతురుకి ఇచ్చిన ధైర్యం కూడా అదే. తన తల్లి ఇచ్చిన ధైర్యంతోనే తాను ఎలా తన వైఫల్యాన్ని చాలెంజ్ గా తీసుకుని మ్యాథ్స్ లో ఎలా రాణించిందో తెలుపుతు జైనాబ్ ఇచ్చిన సందేశం కూడా అదే..