Laughing Buddha : లాఫింగ్ బుద్ధా ఇంట్లో ఉంటే నిజంగానే అదృష్టం వరిస్తుందా..?

నిజంగానే లాఫింగ్ బుద్ధా అదృష్టాన్ని తెచ్చి పెడుతుందా..? నష్టాల్లో కూరుకుపోయినవారిని లాఫింగ్ బుద్ధా లాభాల్లోకి తెస్తాడా..? లాఫింగ్ బుద్ధా బొమ్మలకు ఎందుకంత క్రేజ్..?

Laughing Buddha : లాఫింగ్ బుద్ధా ఇంట్లో ఉంటే నిజంగానే అదృష్టం వరిస్తుందా..?

lucky Laughing Buddha positive energy

lucky Laughing Buddha positive energy : లాఫింగ్ బుద్ధ.ఆనందానికి చిహ్నం.ముద్దుగా, బొద్దుగా బుజ్జి బొజ్జతో బుగ్గన సొట్టలతో నవ్వుతు ఉండే లాఫింగ్ బుద్ధా బొమ్మలు ప్రపంచ వ్యాప్తంగా పేరొందాయి. లాఫింగ్ బుద్ధా బొమ్మలు ఇంట్లో పెట్టుకుంటే అదృష్టం వరిస్తుందని ఆ ఇంట్లో సంతోషాలు వెల్లివిరుస్తాయని నమ్ముతారు. వాస్తు నిపుణులు కూడా లాఫింగ్ బుద్ధా బొమ్మలు ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని..నరదృష్టి తగలదని సూచిస్తుంటారు. నిజంగానే లాఫింగ్ బుద్ధా అదృష్టాన్ని తెచ్చి పెడుతుందా..? నష్టాల్లో కూరుకుపోయినవారిని లాఫింగ్ బుద్ధా లాభాల్లోకి తెస్తాడా..? లాఫింగ్ బుద్ధా బొమ్మలకు ఎందుకంత క్రేజ్.? అంటే .. ఆ బొమ్మలో ఉండే నవ్వే అసలు సిసలైన పాజిటివ్ ఎనర్జీ అంటారు మానసిన నిపుణులు. పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఆటోమేటిక్ గా సంతోషాలు లాభాలు వస్తాయని అదే ఆనవ్వుల బుద్ధుడిలోని టెక్నిక్ అంటున్నారు.

Laughing Buddha : ఎవరీ లాఫింగ్ బుద్ధా .? ఆయనకు ఎందుకా పేరు వచ్చిందో తెలుసా..?
నవ్వు ఆనందాన్ని తెచ్చి పెడుతుంది.ఎన్ని బాధల్లో ఉన్నా మఖంలో చిరునవ్వు ఉంటే ఆ బాధల్ని జయించినట్లే. నవ్వు అంటేనే పాజిటివ్. లాఫింగ్ బుద్ధా బొమ్మలో ఉండే అసలు సిసలైనది ఆ నవ్వే. లాఫింగ్ బుద్ధా బొమ్మను కాసేపు అలాగే చూస్తుంటే మనకు తెలియకుండానే మన ముఖంలో నవ్వు వస్తుంది. అదే పాజిటివ్. ఆ పాజిటివ్ లోనే దాగుంది అసలైన అదృష్టం. అందుకే లాఫింగ్ బుద్ధాకు అంత డిమాండ్. అటువంటి లాఫింగ్ బుద్ధా బొమ్మల్ని ఇంట్లో ఎక్కడి పడితే అక్కడ పెట్టుకోకూడదని వాటికో ప్రత్యేక స్థానాలు ఉన్నాయని చెబుతున్నారు వాస్తు నిపుణులు. లాఫింగ్ బుద్ధ బొమ్మను ఎక్కడ పెట్టుకోవాలో తెలుసుకుందాం..

ఎక్కడపడితే అక్కడ పెట్టొద్దు..
లాఫింగ్ బుద్ధా బొమ్మను మనకు నిరంతరం కనిపించే ప్రాంతంలో పెట్టుకోవాలి..
నేలమీద అసలు పెట్టకూడదు
చీకటిగా ఉండే ప్రదేశంలో అస్లు పెట్టకూడదు..
టీవి,ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఉంచకూడదు..
పూజా స్థానంలో కూడా పెట్టకూడదు..
చెప్పుల స్టాండ్ మీద అస్సలు పెట్టకూడదు..
కాలికి తగిలే చోటు కూడా పెట్టకూడదు..
ఉదయం లేవగానే చూసే చోటు పెట్టుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఆరోజు అంతా ఉంటుంది..
ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంచడం అన్నింటికంటే చాలా మంచిది..
ఇంట్లోకి అడుగు పెట్టగానే కంటికి కనిపించేలా పెట్టుకుంటే మంచిది..అలసిపోయి ఇంటికి రాగానే లాఫింగ్ బుద్ధాను చూస్తే అలసట అంతా మర్చిపోతాం..కొత్త ఉత్సాహం వస్తుంది..
ఇంట్లో ఎన్ని లాఫింగ్ బుద్ధాలు అయినా పెట్టుకోవచ్చు..రకరకాల ఆకృతుల్లో ఉండేవి తెచ్చుకుని పెట్టుకుంటే ఇల్లంతా చక్కటి పాజిటివ్ నెస్ ఉంటుంది..