Lottery : రూ.100 ఉమ్మడి పెట్టుబడితో రూ.కోటిన్నర లాటరీ గెలిచిన స్నేహితులు

ఎన్నాళ్లగానో వేచి చూసిన అదృష్టం ఆ ఇద్దరు స్నేహితులను వరించింది. రూ.100లు పెట్టుబడితో కోటిన్నర రూపాయలు గెలుచుకున్నారు. దీంతో స్నేహితుల ఆనందం మిన్నంటింది.

Lottery : రూ.100 ఉమ్మడి పెట్టుబడితో రూ.కోటిన్నర లాటరీ గెలిచిన స్నేహితులు

Won Punjab Friends Lottery

Updated On : October 4, 2023 / 11:48 AM IST

Won Punjab Friends Lottery : కేవలం రూ.100లు ఉమ్మడి పెట్టుబడితో రూ. కోటిన్నర లాటరీ గెలుసుకున్నారు ఇద్దరు స్నేహితులు. లాటరీ టికెట్లు కొనటం సరదాగా పెట్టుకున్న ఇద్దరు దోస్తులను అదృష్టం వరించింది.చెరో యాభై రూపాయలు వేసుకుని మొత్తం వంద రూపాయలు పెట్టి కోటిన్నర రూపాయలు గెలుపొందారు పంజాబ్ కు చెందిన ఇద్దరు స్నేహితులు.

ఫాజిల్కా జిల్లాలో అబోహర్‌ పట్టణానికి చెందిన రమేశ్‌, కుకీ అనే ఇద్దరు స్నేహితులు.వారికి 14 ఏళ్లుగా లాటరీ టికెట్లు కొనే అలవాటుంది. ఎప్పుడు కొన్నా ఇద్దరు చెరో సగం వేసుకుని కొంటుంటారు. కానీ చిన్న చిన్న బహుమతులులు తప్పించి పెద్దగా అనుకున్నదేమీ పొందలేకపోయేవారు.అలాగని వారు కొనటం మానలేదు. దీంట్లో భాగంగానే గత కొన్నాళ్ల క్రితం ఇద్దరు కలిసి చెరో యాభై రూపాయలు వేసుకుని లాటరీ టికెట్ కొన్నారు. కానీ వారికి ఎటువంటి ఆశా లేదు. ఈసారి కూడా మనకు అదృష్టం వరించదేమో అనుకున్నారు. కానీ అనుకోనిది జరిగితేనే కదా మజా వస్తుంది. అలా వారు ఆశించకపోయినా అదృష్ట లక్ష్మి వరించింది. ఇద్దరు కలిసి రూ.100 పెట్టి కొన్న లాటరీ టికెట్ కు రూ.కోటిన్నర బహుమతి తగలింది.

గత ఆదివారం (అక్టోబర్1,2023) విడుదలైన ఫలితాల్లో వారు కొన్న టికెట్ కు రూ.కోటిన్నర బహుమతి తగలిందని సమాచారం వచ్చింది. అంతే వారి ఆనందానికి అంతులేదు. ఇన్నాళ్లకు మనల్ని అదృష్ట లక్ష్మి వరించింది అంటూ పొంగిపోయారు. ఇద్దరు ఆత్మీయంగా కౌగలించుకుని ఆనందాన్ని పొందారు. సోమవారం ఘంటాఘర్‌ చౌరస్తాలోని జ్ఞాన్‌చంద్‌ లాటరీ విక్రయకేంద్రం వద్దకు ఈ మిత్రులిద్దరూ బ్యాండుమేళంతో వచ్చారు. బ్యాండు దరువుకు డ్యాన్సులు చేస్తూ స్వీట్లు పంచుకుని సందడి సందడి చేశారు. లాటరీ డబ్బును తమ పిల్లల కోసం, కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఖర్చు చేస్తామని రమేశ్‌, కుకీ తెలిపారు.