Rahul Gandhi : కూలీగా మారిన రాహుల్‌గాంధీ, రెడ్ షర్టు ధరించి రైల్వే స్టేషన్‌లో సూట్‌కేసు మోసిన రాహుల్‌

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రైల్వే స్టేషన్ లో సూట్ కేసులు మోసారు.

Rahul Gandhi : కూలీగా మారిన రాహుల్‌గాంధీ, రెడ్ షర్టు ధరించి రైల్వే స్టేషన్‌లో సూట్‌కేసు మోసిన రాహుల్‌

Rahul Gandhi lifts luggage at railway station

Rahul Gandhi lifts luggage at railway station : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ( Rahul Gandhi )కూలీగా మారారు. రైల్వే స్టేషన్ లో సూట్ కేసులు మోసారు. దీంతో అక్కడున్న కూలీలు (పోర్టర్లు)లంతా నినాదాలు చేశారు. రాహుల్ గాంధీ గురువారం (సెప్టెంబర్ 21,2023) ఢిల్లీలోని ఆనంద్ విహార రైల్వే స్టేషన్ (Delhi Anand Vihar Railway Station)లో రాహుల్ గాంధీ ఓ సాధారణ కూలీలా సూట్ కేసులో మోసిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ లో పోర్టర్లను కలిసిన రాహుల్ గాంధీ వారిలో ఒకడిగా కలిసిపోయారు. వారి పక్కనే కూర్చుని కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. వారితో చాలాసేపు ముచ్చటించారు. వారుండే గదికి వెళ్లి పరిశీలించారు. అనంతరం ఆయన రైల్వే కూలీలానే రెడ్ కలర్ షర్టు ధరించారు. చేతికి పోర్టర్ బ్యాడ్జ్ కట్టుకుని తలపై సూట్ కేసులు పెట్టుకుని మోసారు.

రాహుల్ గాంధీ తమ వద్దకు వచ్చి తమ సమస్యలు తెలుసుకోవటంతో పోర్టర్లు అందరు ఆనందం వ్యక్తంచేశారు. రాహుల్‌తో కలిసి సెల్ఫీ దిగారు. రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ పోర్టర్లు నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కాంగ్రెస్ ట్విట్టర్ లో షేర్ చేసింది. ప్రజానేత రాహుల్‌గాంధీ ఆనంద్‌ విహార్ రైల్వే స్టేషన్‌లో పోర్టర్లను కలిశారని తెలిపింది. మరోసారి భారత్ జోడో యాత్ర జరుగుతుందని కాంగ్రెస్ పేర్కొంది.