Aadhaar for Stray Dogs : వీధి కుక్కలకు ఆధార్ కార్డులు .. వాటి మెడలోనే క్యూఆర్ కోడ్ కార్డు
మనుషులకే కాదు వీధి కుక్కలకు కూడా ఆధార్ కార్డు వచ్చాయి. వాటి వివరాన్ని ఆ కార్డులో ఉంటాయి.

mumbai stray dogs aadhaar
Mumbai stray dogs aadhaar : అన్నింటికి ఆధారం ‘ఆధార్’ కార్డు అన్నట్లుగా మారిపోయింది. ప్రతీ భారతీయుడికి ఏది ఉన్నా లేకుండా ఆధార్ కార్డు మాత్రం గుర్తింపుగా ఉండాల్సిందే. 12 సంఖ్యలు గల ఆధార్ కార్డు అన్నింటి ఆధార్ ఉందా అని అడిగేలా మారిపోయింది పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విశిష్ట గుర్తింపు 12 సంఖ్యలు గల ఆధార్ కార్డు. మరి అటువంటి ఆధార్ మనుషులకే కాదు మాక్కూడా ‘ఆధార్’అంటున్నాయి వీధి కుక్కలు. వీధి కుక్కలకు కూడా ఆధార్ కార్డు (stray dogs aadhaar)ఉండాలని అనుకున్నారు ముంబైకి చెందిన ఇంజనీర్ అక్షయ్ రిడ్లాన్(Akshay Ridlan). ఆయనకు వచ్చిన ఈ వినూత్న ఆలోచనలకు రూపం వీధికుక్కలకు ఆధార్ కార్డులు వచ్చాయి. మనుషులకు సంబంధించి ఆధార్ కార్డులో వ్యక్తిగత వివరాలు, అడ్రస్ ఎలాగైతే పొందుపరుస్తారో.. అలాగే వీధి కుక్కల వివరాలతో డిజిటల్ క్యూఆర్ కోడ్ ఉన్న కూడిన కార్డులను రెడీ చేసి వాటి మెడల్లో వేశారు అక్షయ్. అలా ముంబై విమానాశ్రయం (Chhatrapati Shivaji Maharaj International Airport)పరిసరాల్లో తిరుగుతున్న 20 వీధి కుక్కలు ఆధార్ కార్డులు సంపాదించాయి. క్యూఆర్ కోడ్లతో రూపొందించిన ఆధార్ కార్డులను శనివారం (జులై15,2023) ఉదయం ఆ కుక్కల మెడలో వేశారు అక్షయ్.
Tamil Nadu : మరీ ఇంత త్యాగమా..! కొడుకు చదువు కోసం బస్సు కింద పడిన తల్లి..
ఈ ఆధార్ కార్డుల్లో ఆ కుక్కలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. వీధి కుక్కలకు వివరాలు ఏముంటాయనుకుంటున్నారా..? నిజమే మరి అవి ఎక్కడంటే అక్కడ తిరుగుతుంటాయి. కానీ ఎక్కడెక్కడ తిరిగినా తిరిగి అవి ఉండే ప్రాంతానికే చేరుకుంటాయి. ఆ విషయాన్ని గుర్తించిన అక్షయ్ ఆ కుక్కలు ఉండే ఏరియా వివరాలు, వాటి వయస్సుతో పాటు మరి ముఖ్యంగా వాటికి స్టెరిలైజేషన్ చేశారా? లేదా? అనే సమాచారం, టీకాల వివరాలు, కుక్క తప్పిపోయినప్పుడు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నంబర్లువంటివి ఈకార్డుల్లో పొందుపరిచాయి. ఈ సమాచారం అంతా ఒక క్యూఆర్ కోడ్‌గా మార్చారు. దాన్ని స్కాన్ చేస్తే ఆ కుక్కలకు సంబంధించిన మొత్తం సమాచారం అందులో వస్తుంది.
ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతు..ముంబై నగరంలోని వీధి కుక్కలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేలా లొకేషన్ ఆప్షన్‌ను కూడా ఈ ఐడీ కార్డులకు జతచేస్తామని వెల్లడించారు. pawfriend.in పేరుతో తాను నిర్వహిస్తున్న వెబ్‌సైట్‌లో ఐడీ కార్డులు జారీచేసి చేసిన వీధి కుక్కల వివరాలను పొందుపరిచామని తెలిపారు. కుక్కలకు ఐడీ కార్డులు వేసే క్రమంలో ఆ 20 కుక్కలకు టీకాలు కూడా వేయించామని తెలిపారు. ముంబైలోని దాదాపు 300 వీధి కుక్కలకు ఆహారం అందజేసే బాంద్రా వాసి సోనియా షెలార్.. ముంబై మున్సిపల్ కారొరేషన్‌కు చెందిన పశువైద్యుడు డాక్టర్ కలీమ్ పఠాన్‌లు pawfriend.in సభ్యులతో కలిసి పనిచేస్తున్నారు. ఆ కుక్కలకు టీకాలు వేయించి, ట్యాగింగ్ చేయిస్తున్నారు.
Greater Noida : టోల్ ప్లాజా దగ్గర మహిళ వీరంగం .. ఉద్యోగిని జుట్టుపీకి కిందపడేసి కొట్టిన మహిళ..