Greater Noida : టోల్ ప్లాజా దగ్గర మహిళ వీరంగం .. ఉద్యోగిని జుట్టుపీకి కిందపడేసి కొట్టిన మహిళ..

టోల్ ఫీజు చెల్లించమని అడిగినందుకు ఓ మహిళ సాటి మహిళ అని కూడా చూడకుండా టోల్ ప్లాజా మహిళా సిబ్బందిని ఇష్టమొచ్చినట్లు కొట్టింది. నానా దుర్భాషలాడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Greater Noida : టోల్ ప్లాజా దగ్గర మహిళ వీరంగం .. ఉద్యోగిని జుట్టుపీకి కిందపడేసి కొట్టిన మహిళ..

Greater Noida

Updated On : July 18, 2023 / 3:34 PM IST

Greater Noida : గ్రేటర్ నోయిడాలోని టోల్ ప్లాజా దగ్గర మహిళ వీరంగం సృష్టించింది. టోల్ చెల్లించమన్నందుకు ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించింది. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Greater Noida society: లుంగీలు, నైటీలు బ్యాన్.. కీలక నిర్ణయం తీసుకున్న గ్రేటర్ నోయిడాలోని ఓ సొసైటీ..
గ్రేటర్ నోయిడాలో టోల్ ప్లాజా ఉద్యోగితో ఓ మహిళ అసభ్యంగా ప్రవర్తిస్తూ కెమెరాకు చిక్కింది. ఉత్తరప్రదేశ్‌లోని దాద్రీ పోలీస్ స్టేషన్ పరిధిలోని లుహర్లీ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టోల్ చెల్లించమని అడిగినందుకు మహిళా సిబ్బంది జుట్టు లాగి ముఖం చిదిమి కుర్చీలోంచి కింద పడేసింది. ఈ దృశ్యాలు టోల్‌ప్లాజా వద్ద అమర్చిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. @SrishtiKanwar22 అనే ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

 

టోల్ బూత్ లోకి ప్రవేశించిన మహిళ..మహిళా సిబ్బందితో గొడవపడినట్లు వీడియోలో ఉంది. ఉద్యోగినితో వాగ్వాదానికి దిగడమే కాకుండా ముఖాన్ని ఒక చేత్తో, జుట్టు మరో చేత్తో పట్టుకుంది. మహిళా ఉద్యోగి నిస్సహాయురాలిగా చూస్తూ ఉండిపోయింది. చివరకు ఉద్యోగినిని కుర్చీలోంచి కిందపడేసింది.

Noida : కొబ్బరికాయలపై మురుగునీరు చల్లిన వ్యాపారిని అరెస్టు చేసిన నోయిడా పోలీసులు

టోల్ బూత్‌లోకి వచ్చిన ఇద్దరు మగవారు ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరడం.. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోవడం సీసీ కెమెరాలో కనిపించింది. నేషనల్ హైవే 91 టోల్ ప్లాజా ఇన్ ఛార్జ్ కంపెనీ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. టోల్ ప్లాజా ఉద్యోగినిపై చేయి చేసుకున్న మహిళ గురించి ఆరా తీస్తున్నారు.