Greater Noida society: లుంగీలు, నైటీలు బ్యాన్.. కీలక నిర్ణయం తీసుకున్న గ్రేటర్ నోయిడాలోని ఓ సొసైటీ..

గ్రేటర్ నోయిడాలోని ఓ సొసైటీ డ్రెస్‌కోడ్ విధించింది. సొసైటీ ప్రాంగణంలో నైటీలు, లుంగీలను ధరించడం నిషేధించింది.

Greater Noida society: లుంగీలు, నైటీలు బ్యాన్.. కీలక నిర్ణయం తీసుకున్న గ్రేటర్ నోయిడాలోని ఓ సొసైటీ..

Greater Noida society

Updated On : June 14, 2023 / 2:30 PM IST

Lungis and Nighties ban: గ్రేటర్ నోయిడాలోని ఓ సొసైటీకి చెందిన రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. స్థానికంగా నివసించే ప్రజలు డ్రెస్ కోడ్‌ను పాటించాలని, తద్వారా మహిళలు, పురుషులు ఒకరినొకరు గౌరవించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి హిమ్‌సాగర్ అపార్ట్‌మెంట్ ఆర్‌డబ్ల్యూఏ అధ్యక్షుడు జూన్10న నోటీసులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ నోటీసులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ నోటీసులో అపార్ట్‌మెంట్‌లో నివసించే ప్రజలు అపార్ట్‌మెంట్‌లో, అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన పార్కులో నైటీలు, లుంగీలు ధరించి తిరగొద్దని సూచించారు. కాంపౌండ్‌లో ప్రతిరోజూ యోగా సాధన చేస్తున్నప్పుడు వదులుగాఉన్న దుస్తులు ధరించిన వ్యక్తుల గురించి కొన్ని ఫిర్యాదులు అందిన తరువాత ఈ నోటీసులు జారీ అయ్యాయి.

Amazon jungle Search On For Heroic Dog: కారడవుల్లో పిల్లలను రక్షించి.. తప్పిపోయిన వీరోచిత జాగిలం.. ఎక్కడ ఉందో!

గ్రేటర్ నోయిడాలోని ఫై-2లో హిమ్ సాగర్ సొసైటీ జారీ చేసిన నోటీసులో కీలక విషయాలు పేర్కొంది. మీరు బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు మీ ప్రవర్తనపై ఎవరైనా అభ్యంతరం చెప్పే అవకాశం ఇవ్వద్దు. మీ ప్రవర్తన, దుస్తులపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. ఇందులో భాగంగా ప్రతిఒక్కరూ తమ నివాసం నుంచి బయటకు వచ్చే సమయంలో లుంగీ, నైటీని ఎట్టిపరిస్థితుల్లోనూ ధరించవద్దు. లుంగీ, నైటీ ధరించి అపార్ట్‌మెంట్‌లో సంచరించడం చేయవద్దని నోటీసుల్లో పేర్కొంది.

Cyclone Biparjoy 8 states on Alert: తుపాన్ ముప్పు.. 8 రాష్ట్రాలు అలర్ట్, 17 ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు

ఈ విషయంపై హిమ్‌సాగర్ అపార్ట్‌మెంట్ ఆర్‌డబ్ల్యూఏ అధ్యక్షుడు సీకే కల్రా స్పందిస్తూ.. మేం తీసుకున్నది మంచి నిర్ణయం. ప్రతిఒక్కరూ దీనిని గౌరవించాలి. మహిళలు నైటీలు ధరించి తిరుగుతుంటే పురుషులకు, పురుషులు లుంగీలు ధరించి తిరుగుతుంటే మహిళలకు అసౌకర్యంగా ఉంటుంది. ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఈ క్రమంలోనే లుంగీలు, నైటీలను అపార్ట్‌మెంట్‌లో నిషేధించామని అన్నారు.

Foods to Help Fight Stress : ఒత్తిడికి గురైనప్పుడు తీసుకోవాల్సి ముఖ్యమైన 5 ఆహారాలు ఇవే ?

సోషల్ మీడియాలో సొసైటీ జారీచేసిన నోటీసులు వైరల్‌గా మారాయి. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కొందరు నెటిజన్లు సొసైటీ నిర్ణయానికి మద్దతు తెలుపుతుండగా, కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఇది మంచి నిర్ణయం. ప్రతీఒక్కరూ డ్రెస్సింగ్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. పెద్దవారు బయటకు వచ్చినప్పుడు గౌరవంగా ఉండే డ్రస్సులు ధరించాలి. తద్వారా పిల్లలు కూడా మీ నుంచి నేర్చుకుంటారు. సొసైటీ తీసుకున్న నిర్ణయం బాగుంది అని మరో నెటిజన్ పేర్కొన్నారు. మరో నెటిజన్ సొసైటీ నిర్ణయాన్ని తప్పుబట్టారు. దుస్తుల విషయంలో ఎవరి అభిప్రాయాలను వారు గౌరవించాలి. అలాకాకుండా నిబంధనలు పెట్టడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించినట్లవుతుంది అని పేర్కొన్నాడు.