Cyclone Biparjoy 8 states on Alert: తుపాన్ ముప్పు.. 8 రాష్ట్రాలు అలర్ట్, 17 ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు

బిపర్‌జోయ్ తుపాన్ తీవ్రత నేపథ్యంలో భారత వాతావరణశాఖ 8 రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.గుజరాత్‌లోని కచ్‌లోని ఓఖా ఓడరేవు సమీపంలో శక్తివంతమైన తుపాన్ తీరం దాటనున్న దృష్ట్యా గుజరాత్ అధికారులు మంగళవారం సముద్ర తీర ప్రాంతాల నుంచి 30 వేల మందిని తాత్కాలిక షెల్టర్ల తరలించారు.....

Cyclone Biparjoy 8 states on Alert: తుపాన్ ముప్పు.. 8 రాష్ట్రాలు అలర్ట్, 17 ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు

Cyclone Biparjoy Alert

Cyclone Biparjoy 8 states on Alert: బిపర్‌జోయ్ తుపాన్ తీవ్రత నేపథ్యంలో భారత వాతావరణశాఖ 8 రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. గుజరాత్‌లోని కచ్‌లోని ఓఖా ఓడరేవు సమీపంలో శక్తివంతమైన తుపాన్ తీరం దాటనున్న దృష్ట్యా గుజరాత్ అధికారులు మంగళవారం సముద్ర తీర ప్రాంతాల నుంచి 30 వేల మందిని తాత్కాలిక షెల్టర్లకు తరలించారు. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గోవా, లక్షద్వీప్ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ (IMD) బుధవారం వాతావరణ హెచ్చరిక జారీ చేసింది.

Cyclone Biparjoy:ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్రమత్తం…గుజరాత్ తీరంలో ఆయిల్ రిగ్ వద్ద చిక్కుకుపోయిన 50 మంది సురక్షితంగా తరలింపు

గుజరాత్‌ సముద్ర తీరంలో జూన్ 16వతేదీ వరకు ఫిషింగ్ కార్యకలాపాలు నిలిపివేశారు. సముద్రం చాలా అల్లకల్లోలంగా మారినందున ఓడరేవులను కూడా మూసివేశారు. ఓడరేవుల్లో ఓడలను లంగరు వేశారు. తుపాను సమీపిస్తున్న కారణంగా ఈ ప్రాంతంలో భారీ వర్షాలు, బలమైన గాలులతో వాతావరణం ప్రతికూలంగా మారింది. తుపాన్ సందర్భంగా తీర ప్రాంతాల్లో సన్నద్ధతపై కేంద్ర మంత్రులు సమీక్షించారు.

Cyclone Biparjoy Intensifies: బిపర్‌జోయ్ తుపాన్ ఎఫెక్ట్..95 రైళ్ల రద్దు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా మంగళవారం దేశ రాజధానిలో తుపాన్ సంసిద్ధతను సమీక్షించారు.తుపాన్ సందర్భంగా నష్టాన్ని తగ్గించాలని అన్ని శాఖల అధికారులను అమిత్ షా ఆదేశించారు.బిపర్ జోయ్ తుపాను తీవ్ర తుఫానుగా మారడంతో బుధవారం ఉదయం గుజరాత్‌సముద్ర తీరంలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న అలలు కనిపించాయి.

Donald Trump Under Arrest: రహస్య పత్రాల కేసులో డొనాల్డ్ ట్రంప్ అరెస్ట్

గుజరాత్‌లోని కచ్, పోర్ బందర్, అమ్రేలి, గిర్ సోమనాథ్, ద్వారకా జిల్లాల్లోని పాఠశాలలకు రెండు రోజుల సెలవు ప్రకటించారు.గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ బుధవారం ఉదయం 10 గంటలకు స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించనున్నారు. కచ్‌లో నాలుగు, ద్వారక, రాజ్‌కోట్‌లలో మూడు, జామ్‌నగర్‌లో రెండు, పోర్‌బందర్‌లో ఒక బృందంతో సహా మొత్తం 17నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందాలను మోహరించారు.