Cyclone Biparjoy: ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్రమత్తం.. గుజరాత్ తీరంలో ఆయిల్ రిగ్ వద్ద చిక్కుకుపోయిన 50 మంది సురక్షితంగా తరలింపు

బిపర్ జోయ్ తుపాన్ తీవ్రత నేపథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగి సహాయ, పునరావాస చర్యలు చేపట్టిందితుపాన్ దృష్ట్యా గుజరాత్‌లోని ఓఖాకు పశ్చిమాన 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాక్-అప్ ఆయిల్ రిగ్ నుంచి 50 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్‌ సురక్షిత ప్రాంతాలకు తరలించింది....

Cyclone Biparjoy: ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్రమత్తం.. గుజరాత్ తీరంలో ఆయిల్ రిగ్ వద్ద చిక్కుకుపోయిన 50 మంది సురక్షితంగా తరలింపు

Coast Guard evacuates 50 crew members

Updated On : June 14, 2023 / 12:08 PM IST

Coast Guard evacuates 50 crew members: బిపర్ జోయ్ తుపాన్ తీవ్రత నేపథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్స్ రంగంలోకి దిగి సహాయ, పునరావాస చర్యలు చేపట్టింది. (Cyclone Biparjoy) తుపాన్ దృష్ట్యా గుజరాత్‌లోని ఓఖాకు పశ్చిమాన 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న జాక్-అప్ ఆయిల్ రిగ్ (oil rig in Gujarat) నుంచి 50 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్‌ సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

Cyclone Biparjoy Intensifies: బిపర్‌జోయ్ తుపాన్ ఎఫెక్ట్..95 రైళ్ల రద్దు

జూన్ 15వతేదీ గురువారం నాడు గుజరాత్‌లో బిపర్‌జోయ్ తుపాను తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ తరలింపు మిషన్ చేపట్టింది. ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇతర కేంద్ర ఏజెన్సీలతో కలిసి ముందస్తు,సహాయ చర్యలు చేపట్టింది. వేదాంత లిమిటెడ్ నిర్వహిస్తున్న కీ సింగపూర్ జాక్-అప్ ఆయిల్ రిగ్ నుంచి 50 మంది సిబ్బందిని తరలించింది. కోస్ట్ గార్డ్ షిప్ అనే షూర్ అనే ఓడను సహాయక చర్యల కోసం సిద్ధం చేశారు. తుపాన్ తీవ్రత నేపథ్యంలో అదనంగా తరలింపు కోసం రాజ్‌కోట్ నుంచి ఓఖా వరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ హెలికాప్టర్‌ను కూడా మోహరించారు.