Amazon jungle Search On For Heroic Dog: కారడవుల్లో పిల్లలను రక్షించి.. తప్పిపోయిన వీరోచిత జాగిలం.. ఎక్కడ ఉందో!

దట్టమైన అమెజాన్ కారడవిలో తప్పిపోయిన నలుగురు పిల్లల్ని రక్షించిన వీరోచిత జాగిలం విల్సన్ తప్పిపోయిన ఉదంతం తాజాగా వార్తల్లోకెక్కింది. తప్పిపోయిన పిల్లలు బొగోటాలోని సైనిక ఆసుపత్రిలో వైద్యుల సంరక్షణలో ఉన్నారు. కాని ఈ అద్భుతమైన రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం చేసిన విల్సన్ అనే ఆరేళ్ల బెల్జియన్ షెపర్డ్ మాలినోయిస్ అనే జాగిలం మాత్రం అడవిలో తప్పిపోయింది....

Amazon jungle Search On For Heroic Dog: కారడవుల్లో పిల్లలను రక్షించి.. తప్పిపోయిన వీరోచిత జాగిలం.. ఎక్కడ ఉందో!

Search On For Heroic Dog

Amazon jungle Search On For Heroic Dog : దట్టమైన అమెజాన్ కారడవిలో తప్పిపోయిన నలుగురు పిల్లల్ని రక్షించిన వీరోచిత జాగిలం విల్సన్ తప్పిపోయిన ఉదంతం తాజాగా వార్తల్లోకెక్కింది.కారడవిలో తప్పిపోయి, 40 రోజుల తర్వాత సురక్షితంగా బయటపడిన నలుగురు పిల్లలు లెస్లీ జాకోంబైర్ ముకుటుయ్(13),సోలీనీ జాకోంబైర్ ముకుటుయ్(9), టియన్ నోరియల్ రోనోక్ ముకుటుయ్(4), ఏడాది వయసున్న క్రిస్టిన్ నెరిమాన్ రానోక్ ముకుటుయ్ లు బొగోటాలోని సైనిక ఆసుపత్రిలో వైద్యుల సంరక్షణలో ఉన్నారు. కాని ఈ అద్భుతమైన రెస్క్యూ ఆపరేషన్‌లో సహాయం చేసిన విల్సన్ అనే ఆరేళ్ల బెల్జియన్ షెపర్డ్ మాలినోయిస్ అనే జాగిలం మాత్రం అడవిలో తప్పిపోయింది. రెస్క్యూ మిషన్ సమయంలో అన్వేషణ సిబ్బంది పిల్లలు తిరిగే మార్గాన్ని మ్యాపింగ్ చేసే పనిలో ఉన్నపుడు, పిల్లల్ని కనుగొన్న విల్సన్ జాగిలం మాత్రం అదృశ్యమవడం అందరినీ కలచివేస్తోంది.

Cyclone Biparjoy 8 states on Alert: తుపాన్ ముప్పు..8 రాష్ట్రాలు అలర్ట్, 17 ఎన్డీఆర్ఎఫ్ బృందాల మోహరింపు

పిల్లలు ప్రయాణించిన విమానం మే 1వతేదీన అమెజాన్ అడవిలోకి పడిపోయిన 40 తర్వాత వారు సజీవంగా దొరికారు. కొలంబియాలోని అమెజాన్ అడవిలో తప్పిపోయిన జాగిలం ఆచూకీ లభిస్తుందనే ఆశతో అన్వేషణ సిబ్బంది ఉన్నారు. లెట్స్ గో..విల్సన్ జాగిలం కోసం వెతుకులాట పేరిట హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ‘‘మా కమాండో విల్సన్ జాగిలాన్ని అడవి నుంచి పట్టుకోవడానికి సిబ్బంది అంతా ఏకమయ్యాం… మేం ఎప్పుడు మా సహచరుడైన జాగిలాన్ని విడిచి పెట్టం’’ అని కొలంబియా సాయుధ దళాల కమాండర్ మేజర్ జనరల్ హెల్డర్ ఫెర్నాన్ గిరాల్డో బోనిల్లా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Cyclone Biparjoy: ఇండియన్ కోస్ట్ గార్డ్ అప్రమత్తం…గుజరాత్ తీరంలో ఆయిల్ రిగ్ వద్ద చిక్కుకుపోయిన 50 మంది సురక్షితంగా తరలింపు

రెండు వారాల రెస్క్యూ ప్రయత్నాల తర్వాత సెర్చ్ పార్టీ పిల్లల తల్లి మాగ్డలీనా ముకుటుయ్‌తో పాటు రెండవ వ్యక్తి, పైలట్ మృతదేహాలను గుర్తించింది.శిథిలాల్లో సగం తిన్న పండు, పిల్లల బాటిల్ కూడా దొరకడంతో తద్వారా పిల్లలు ఇంకా బతికే ఉన్నారని తేలింది. నిత్యం అడవిలో జాగ్వర్‌లు, పాములు, దోమలు, కుండపోత వర్షాలు, సాయుధ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా గ్రూపుల ప్రమాదాల నుంచి హుయిటోటో స్వదేశీ కమ్యూనిటీ పిల్లలు బయటపడటం విశేషం.పిల్లలు పండ్లు, వేర్లు,మొక్కలు తిని జీవించారని కొలంబియాలోని నేషనల్ ఇండిజినస్ ఆర్గనైజేషన్‌కు చెందిన లూయిస్ అకోస్టా చెప్పారు.

Cyclone Biparjoy Intensifies: బిపర్‌జోయ్ తుపాన్ ఎఫెక్ట్..95 రైళ్ల రద్దు

జాగిలం మొదట శిశువు బాటిల్ ను కనుగొనడంతో పిల్లలు ప్రాణాలతో ఉన్నారని శోధన బృందానికి తెలిసింది.మిలిటరీ స్నిఫర్ డాగ్ విల్సన్ బెల్జియన్ షెపర్డ్ జాతికి చెందినది. ఈ జాతి కుక్క తెలివైనది, నమ్మకంగా ఉంటుంది. ఈ కుక్కలు కష్టపడి పనిచేస్తాయి. శిశువు వాడిన సీసాను శోధన సిబ్బంది జాగిలానికి అందించగా, దీని ద్వారా జాగిలం పిల్లల జాడ కనుగొంది. కానీ ఒక విషాదకరమైన మలుపులో పిల్లలను గుర్తించిన జాగిలం జాడ లేకుండా పోయింది. అన్వేషణ బృందం జాగిలం కోసం గాలిస్తుండగా అది సజీవంగానే ఉందని, దీన్ని శోధించే వరకూ తాము నిష్క్రమించమని కొలంబియన్ శోధన బృంద సభ్యులు చెప్పారు.