Noida : కొబ్బరికాయలపై మురుగునీరు చల్లిన వ్యాపారిని అరెస్టు చేసిన నోయిడా పోలీసులు

ఎవరూ చూడట్లేదు కదా అనుకున్నాడు .. కొబ్బరి బొండాలు తాజాగా ఉండాలని మురుగునీరు పట్టి వాటిపై చల్లాడు. అతను చేసిన పని సీసీ కెమెరాలో రికార్డైంది. దెబ్బకి జైలుకి వెళ్లాడు. ఇలాంటి వీడియోలు చూస్తే బయట తినే పదార్ధాల భద్రతపై అందరికీ అనుమానం కలగక మానదు.

Noida : కొబ్బరికాయలపై మురుగునీరు చల్లిన వ్యాపారిని అరెస్టు చేసిన నోయిడా పోలీసులు

Noida

Noida : బయట తినే, తాగే పదార్ధాల పట్ల ఎంతటి జాగ్రత్తలు వహించాలో తెలియజేస్తోంది ఈ వార్త. వేసవి కాలం వెళ్లిపోతున్నా ఎండ తీవ్రత ఇంకా తగ్గలేదు. బయటకు వెళ్లినవారు దాహం తగ్గడం కోసం కొబ్బరి బొండాలు తాగుతారు. ఓ కొబ్బరి బొండాల వ్యాపారి బొండాలపై మురుగునీరు చల్లుతున్న వీడియో సీసీ కెమెరాలో రికార్డైంది. నోయిడా పోలీసుల వరకు చేరి చివరికి జైలు పాలయ్యాడు.

Viral Video : బాబోయ్.. ప్రభుత్వ ఉద్యోగిని రోడ్డుపై పరిగెత్తించిన వ్యాపారి, వేడి వేడి చట్నీతో దాడి.. వీడియో వైరల్

కొందరు వ్యాపారస్తులు తినే పదార్ధాలను అపరిశుభ్రంగా విక్రయిస్తుంటారు. కస్టమర్ల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తారు. ఉత్తరప్రదేశ్ నోయిడాలో ఓ కొబ్బరి బొండాల వ్యాపారి రోడ్డు పక్కన పారుతున్న మురుగునీటిని బాటిల్‌తో తీసుకుని కొబ్బరి బొండాలపై చిలకరిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. శ్రీ‌ రాధా కృష్ణ స్కై గార్డెన్ సొసైటీ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో చూసిన గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు వ్యాపారిని అరెస్టు చేశారు. వ్యాపారి నవీన్ ఉత్తరప్రదేశ్ లోని బరేలీ జిల్లాకు చెందినవాడుగా తెలుస్తోంది.

coconut seller : QR కోడ్‌తో అమ్మకాలు చేస్తున్న కొబ్బరి వ్యాపారి .. అభినందిస్తున్న నెటిజన్లు

ఈ వీడియో చూసిన జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యాపారుల నిర్లక్ష్యం తమ ప్రాణాల మీదకు తెచ్చేలా ఉందని మండిపడుతున్నారు. నవీన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.