Suitcases Banned : ఈ అందాల నగరానికి సూట్‌కేసులు తీసుకెళితే జరిమానా.. ఎన్నో నిబంధనలున్నా పర్యాటకంగా అగ్రస్థానం

అదొక అందాల పర్యాకట ప్రాంతం. కళ్లు తిప్పుకోనివ్వని అందాలకు నెలవు. అక్కడకు వెళ్లాలంటే సూట్ కేసులు పట్టుకెళ్లకూడదు. అది ప్రభుత్వం విధించిన రూల్. ఈ రూల్ అతిక్రమిస్తే జేబులు ఖాళీయే..భారీ జరిమానా తప్పదు. ప్రపంచ పర్యాటకుల్ని ఆకర్షింటే ఈ అందాల ప్రాంతంలో సూట్ కేసులపై నిషేధమే కాదు మరెన్ని వింత నిబంధనలు విధించింది ప్రభుత్వం.

Suitcases Banned : ఈ అందాల నగరానికి సూట్‌కేసులు తీసుకెళితే జరిమానా.. ఎన్నో నిబంధనలున్నా పర్యాటకంగా అగ్రస్థానం

Wheeled Luggage Banned in Dubrovnik Croatia

Wheeled Luggage Banned in Dubrovnik city Croatia : అదొక అందాల పర్యాటక ప్రాంతం. ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది పర్యాటకలు అక్కడికి వస్తుంటారు. సాధారణంగా టూర్ వెళ్లాలంటే ప్రధానంగా కూడా ఉండేది సూట్ కేసులు..బట్టలతో పాటు అన్ని సూట్ కేసుల్లోనే సర్థుకుని తీసుకెళతాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే టూరిస్ట్ ప్లేసుకు సూట్ కేసులు తీసుకెళ్లకూడదు.  అలా కాదని తీసుకెళితే జరిమానా తప్పదని ప్రభుత్వం హెచ్చరించింది. టూరిస్ట్ ప్లేసులో సూట్ కేసులపై నిషేధమా? దీనికి కారణమేంటో తెలుసుకుందాం..

అది యూరప్ లోని క్రోయేషియాలో డుబ్రోవ్నిక్‌ అనే నగరం. అది పర్యాటకంగా పేరొందిన నగరం. యూరప్ లోనే క్రొయేషియా అత్యంత అందమైన దేశాల్లో ఒకటిగా పేరొందింది. అటువంటి క్రొయేషియాలోని డుబ్రోవ్నిక్ నగరం అందమైన సూర్యోదయాన్ని చూడాలనుకునే పర్యాటకుల్ని విపరీతంగా ఆకర్షిస్తుంటుంది. కళ్లు తిప్పుకోలేని అందంతో అక్కడ సూర్యోదయాన్ని చూడటానికి పర్యాటకు క్యూ కడుతుంటారు. అంతేకాదు మధ్యయుగ కాలం నాటి ఇటుకలు, అందమైన రాళ్లతో నిర్మించిన కట్టడాలకు ప్రసిద్ధి చెందింది డుబ్రోవ్నిక్ నగరం. అటువంటి ఈ అందాల నగరంలో సూట్ కేసులపై నిషేధం విధించింది ప్రభుత్వం.

First Flying Car : ప్రపంచంలోనే తొలి ఎరిగే కారు .. అమెరికా ప్రభుత్వం ఆమోదం

దీనికి కారణం ఏమంటే..సాధారణంగా ట్రావెల్ సూట్ కేసులకు చక్రాలుంటాయి కదా.. పర్యాటకు తెచ్చుకున్న చక్రాల సూట్ కేసులు రోడ్లమీద బరబరా లాక్కెళుతుంటే సౌండ్ పొల్యూషన్ అవుతోందట. దీంతో నగర వాసులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు దానిపై దృష్టిపెట్టారు. పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటే అది మరింత పెరుగుతోందని గుర్తించిన అధికారులు ఇటువంటి నిర్ణయం తీసుకున్నారు. నగరంలోకి మరి ముఖ్యంగా ఈ పర్యాటక ప్రాంతంలోకి సూట్ కేసులు తీసుకురాకూడదని..ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే 380 డాలర్ల జరిమానా తప్పదని ఆదేశించారు. అంటే భారత కరెన్సీలో దాదాపు 24,000. చక్రాలు ఉండే సూట్ కేసులతో పాటు చక్రాలు ఉండే అన్ని బ్యాగేలు ఇక్కడ నిషేధం.

మరి టూర్ కు వెళుతు సూట్ కేసు తీసుకెళ్లకపోతే ఎలా..? పెద్ద చిక్కే వచ్చి పడిందే ఈ అందాల నగరం చూడాలంటే అని అనుకుంటున్నారా? కానీ ప్రత్నామ్నాయం కూడా ఉందిలెండి.. సూట్‌కేసులను తెచ్చుకున్నా వాటిని భద్రపరిచేందుకు ప్రత్యేక గదిని ఏర్పాటు చేస్తుందు స్థానిక నగర పాలన సంస్థ. అక్కడ సూట్ కేసులోను డిపాజిట్ చేయాలి. డిపాజిట్ అంటే కాస్తంత డబ్బులు కట్టాల్సి ఉంటుందని డ్నుబ్రోవ్నిక్ మేయర్ మాటో ఫ్రాంకోవిక్ తెలిపారు.

France : ఆందోళనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్ .. కూల్‌గా కూర్చుని సాండ్‌విచ్ తింటున్న కుర్రాడు

కాగా..యూరప్‌లో ఈ ఏడాది పర్యాటకుల రద్దీ బాగా ఉంది. ఎక్కువమంది పర్యాటకులు సందర్శించిన నగరంగా ఈ డుబ్రోవ్నిక్ నగరం అగ్రస్థానంలో ఉంది. అంటే ఈ నగరం పర్యాటకుల్ని ఎంతగా ఆకట్టుకుంటోంది ఊహించుకోవచ్చు. అలా దాదాపు మూడు లక్షల మంది ఈ ప్రాంతాన్ని సందర్శించి బస చేశారని తేలింది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 32 శాతం ఎక్కువగా ఉంది.ఈ నగరంలో సూట్ కేసులపై నిషేధమే కాదు..మరికొన్ని రూల్స్ పాటించి తీరాల్సిందే. పెంపుడు జంతువులను స్వేచ్ఛగా వదిలేయకూడదు. చొక్కా లేకుండా రోడ్లపై తిరగకూడదు. స్మారక చిహ్నాలపై ఎక్కకూడదు.