Tamilnadu Mercantile Bank : క్యాబ్ డ్రైవర్ ఎకౌంట్లో రూ.9,000 కోట్లు జమ, బ్యాంక్ సీఈవో రాజీనామా

చెన్నైకు చెందిన రాజ్‌కుమార్‌ అనే క్యాబ్ డ్రైవర్ బ్యాంక్ ఎకౌంట్ ఏకంగా రూ.9,000 కోట్లు జమ అయ్యాయి. ఈ ఘటనతో ఆ బ్యాంకు ఎండీ, సీఈవో S కృష్ణన్ తన పదవికి రాజీనామా చేశారు.

Tamilnadu Mercantile Bank : క్యాబ్ డ్రైవర్ ఎకౌంట్లో రూ.9,000 కోట్లు జమ, బ్యాంక్ సీఈవో రాజీనామా

Tamilnad Mercantile Bank CEO Krishnan resign

Tamilnad Mercantile Bank CEO Krishnan resign : తమిళనాడులోని చెన్నైకు చెందిన రాజ్‌కుమార్‌ అనే క్యాబ్ డ్రైవర్ బ్యాంక్ ఎకౌంట్ ఏకంగా రూ.9,000 కోట్లు జమ అయ్యాయి. ఆ షాక్ నుంచి కోలుకునేలోపే మరో షాక్ కు గురయ్యాడు. ఇది బ్యాంకు సిబ్బంది పొరపాటువల్ల జరిగింది. తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ (టీఎంబీ) లో జరిగిన ఈ ఘటనతో దాదాపు 10 రోజులకు ఆ బ్యాంకు ఎండీ, సీఈవో S కృష్ణన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇది చిన్న మొత్తం కాకపోవటంతో ఏకంగా సీఈవో రాజీనామాకు దారి తీసింది.

తన రిజైన్ కు సంబంధించి .. వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను అంటూ కృష్ణన్ లేఖలో పేర్కొన్నారు. బ్యాంక్ బోర్డు కృష్ణన్ సమర్పించిన రాజీనామాను ఆమోదించటం గమనించాల్సిన విషయం. తూత్తుకుడిలోని బ్యాంకు డైరెక్టర్ల బోర్డు గురువారం (సెప్టెంబర్ 29,2023)సమావేశమై కృష్ణన్ రాజీనామాను ఆమోదించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ)కి పంపింది. అనంతరం ఆర్ బీఐ నుంచి తదుపరి సూచనలు అందేంత వరకు ఆయన ప్రస్తుత పదవుల్లో కొనసాగుతారని బోర్డు స్పష్టం చేసింది.

Chennai : క్యాబ్‌ డ్రైవర్‌ అకౌంట్లోకి రూ.9వేల కోట్లు .. షాక్ నుంచి కోలుకునే లోపే మరో షాక్..!

చెన్నైకి చెందిన క్యాబ్ డ్రైవర్ రాజ్ కుమార్ కు తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ లో ఎకౌంట్ ఉంది. క్యాబ్ నడిపితేనే వచ్చి చిన్నపాటి సంపాదనతో అతను జీవిస్తున్నాడు. ఈక్రమంలో అని బ్యాంక్ ఎకౌంట్ లో రూ.9,000 కోట్లు జమ అయ్యాయి. దానికి సంబంధించి తన ఫోన్ వచ్చిన మెసేజ్ చూసి షాక్ అయ్యాడు. ఆ ఎమౌంట్ కు ఉన్న సున్నాలు ఎన్నో కూడా గుర్తించలేకపోయాడు. తన ఎకౌంట్ లో కేవలం రూ.150 ఉండాల్సిన తన ఎకౌంట్ లో రూ.9,000 కోట్లు పడినట్లుగా వచ్చిన మెసేజ్ చూసి షాక్ అయ్యాడు. ముందు లైట్ తీసుకున్నాడు. అదేదో జోక్ అనుకున్నాడు. కానీ అది నిజమో కాదో తెలుసుకునేందుకు తన స్నేహితుడికి రూ.21,000లు ట్రాన్స్ ఫర్ చేశాడు. నిజంగానే డబ్బులు ట్రాన్స్ ఫర్ అయ్యాయి. దీంతో అతను నిజమేనని నమ్మాడు.

కానీ అంతలోనే మరో షాక్ అయ్యాడు. కేవలం అరగంటలోనే బ్యాంక్ పొరపాటున రాజ్ కుమార్ ఎకౌంట్ లోకి భారీ మొత్తం క్రెడిట్ అయిన విషయం గుర్తించింది. రాజ్ కుమార్ ఖాతా నుంచి జమ అయిన మొత్తాన్ని వెనక్కి తీసేసుకుంది. ఆ తరువాత బ్యాంక్ సిబ్బంది రాజ్ కుమార్ కు కారు లోన్ ఇస్తామని..అతను ట్రాన్స్ ఫర్ చేసిన రూ.21,000లు తిరిగి ఇవ్వనవసరం లేదని తెలిపింది.

ఈ రూ.9,000 కోట్ల పొరపాటు కాస్తా ..2022 సెప్టెంబర్ లో తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ ఎండీ, సీఈవో బాధ్యతలను స్వీకరించిన కృష్ణన్ క్యాబ్ డ్రైవర్ ఖాతాలో రూ.9.000 కోట్లు పడిన తరువాత తన పదవికి రిజైన్ చేయటం గమనించాల్సిన విషయం. ఈ భారీ తప్పిదం కాస్తా అతని పదవికి రాజీనామా చేసే పరిణామానికి దారి తీసింది. తన పదవీ కాలం ఇంకా రెండొంతులు మిగిలి ఉన్నా..వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేస్తున్నానని రిజైన్ లెటర్ లో ప్రకటించారు.