Viral Video : గుడ్ ట‌చ్‌, బ్యాడ్ ట‌చ్‌ గురించి బాలికలకు టీచర్ చెబుతున్న వీడియోను పోస్ట్ చేసిన ఐపీఎస్ అధికారి

తమపై జరిగే వేధింపులు ఏంటో కూడా తెలియని పసిపిల్లలకు వాటి గురించి అర్థం కావాలంటే ఏం చేయాలి..? ఎవరు చెబుతారు..? తమ మీద పడే చేతులు ఏం చేస్తున్నాయో..ఎందుకోసం తమ లేత శరీరాలపై కామపు చేతులు పడుతున్నాయో కూడా తెలియని పిల్లలకు చక్కటి అవగాహన కల్పిస్తున్నారు ఓ టీచర్.

Viral Video : గుడ్ ట‌చ్‌, బ్యాడ్ ట‌చ్‌ గురించి బాలికలకు టీచర్ చెబుతున్న వీడియోను పోస్ట్ చేసిన ఐపీఎస్ అధికారి

Good touch..Bad touch Teacher message

Updated On : September 29, 2023 / 1:59 PM IST

It’s needed for every child..Good touch Bad touch : అన్నెపున్నెం ఎరుగని పసిమొగ్గలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు గురవుతున్నారు. తమమీద జరుగుతున్న అఘాయిత్యాలు ఏంటో కూడా అర్థంకానీ తెలియని పసిపిల్లలు. కామాంధులకు పసిబిడ్డలు అనే జాలి కూడా లేకుండా దారుణాలకు తెగబడుతున్నారు. దీంతో పసిమొగ్గల జీవితాలు ఛిద్రమవుతున్నాయి. తమపై జరిగే వేధింపులు ఏంటో కూడా తెలియని పసిపిల్లలకు వాటి గురించి అర్థం కావాలంటే ఏం చేయాలి..? ఎవరు చెబుతారు..? తమ మీద పడే చేతులు ఏం చేస్తున్నాయో..ఎందుకోసం తమ లేత శరీరాలపై కామపు చేతులు  పడుతున్నాయో..ఎందుకు తడుముతున్నాయో కూడా తెలియని పిల్లల పాలిట ఓ దేవతలా మారారు ఓ టీచర్. పసిబిడ్డలే అయినా తమ శరీరాలపై పడుతున్న చేతుల స్పర్శ ఇబ్బందికరమని తెలిసినా ఎందుకో తెలియని చిన్నారులకు ఈ టీచర్ నిజంగానే ఓ చక్కటి అవగాహన కల్పిస్తున్నారు.

గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలను చాలా వివరంగా చెబుతున్నారు.ఏ స్పర్శ ఎటువంటిదో తెలిసేలా చిన్నారుల శరీరాలకు తెలియజేస్తున్నారు. ఆ తేడా ఏంటో అర్థమయ్యేలా కన్నతల్లికంటే ఎక్కువగా చెబుతున్నారు. స్కూల్లో టీచర్ చిన్నారులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెబుతున్న వీడియోను ఐపీఎస్ అధికారి ఆర్. స్టాలిన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో అది వైరల్ అవుతోంది.

ఈ వైర‌ల్ వీడియోలో టీచ‌ర్ స్కూల్ బాలిక‌ను ఈ కీల‌క టాపిక్‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తుండ‌టం క‌నిపిస్తుంది. ఈ వీడియోలో ఏది మంచి స్ప‌ర్శ ఏది చెడు స్పర్శ అనే విషయాన్ని ఆ టీచర్ బాలిక‌కు వివ‌రిస్తుంది. టీచ‌ర్ వివ‌రించిన తీరుకు త‌గిన‌ట్టుగా బాలిక ప్ర‌తిస్పందించ‌డం ఈ వీడియో స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ వీడియోలో టీచర్ పాప చెంపలను తాకినప్పుడు..వీపును తాకినప్పుడు ఆ పాప గుడ్ టచ్ అని..చెంపల నుంచి చేతులు చాతీమీదుగా శరీరంమీదకు తెచ్చినప్పుడు అది బ్యాడ్ టచ్ అని పాప గుర్తించింది.వెంటనే చేతుల్ని తీసి వేస్తు ‘నో’ అని చెబుతోంది. అలాగే నడుము పట్టుకుని తడుముతున్నప్పుడు కూడా ‘నో’అంటూ చేతులు విదిలించుకుని అది బ్యాడ్ టచ్ అని గుర్తించింది.ఈ వీడియో క్లాస్ రూములో టీచర్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి బాలికకు చెబుతున్నప్పుడు ఆ క్లాసులో మగపిల్లలు కూడా శ్రద్ధగా చూడటం కనిపిస్తోంది.

స్కూల్లో టీచర్లు పిల్లలకు కేవలం పాఠాలు మాత్రమే కాకుండా సమాజంలో జరుగుతున్న మంచి చెడ్డల గురించి కూడా చెబుతుండాలి. అప్పుడు పిల్లలకు ఏది చెడు ..ఏది మంచి అనేది తెలుస్తుంది. నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఇటువంటి ఈ వీడియోలో ఈ టీచర్ చెబుతున్న పాఠం చాలా అవసరమనే చెప్పి తీరాలి. ఇటువంటివి కేవలం ఆడపిల్లలకే కాదు ఆడపిల్లతో ఎలా ఉండాలో మగపిల్లలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సమాజంలో ఎలా ఉండాలో టీచర్లు నేర్పించాల్సిన అవసరం ఉంది. నేటి సమాజంలో పెరుగుతున్న వింత, వికృత పోకడల రీత్యా ఇటువంటివి చాలా అవసరం అనే అభిప్రాయాలు వ్యక్తమవతున్నాయి. అదే అభిప్రాయాన్ని ఈ వీడియో పోస్ట్ చేసిన ఐపీఎస్ అధికారి ఆర్. స్టాలిన్ కూడా వ్యక్తం చేశారు. ప్రతి బిడ్డకు ఇది అవసరం…గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అద్భుతమైన సందేశం అని పేర్కొన్నారు.

అలాగే కొన్ని రోజుల క్రితం ఓ టీచర్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి విద్యార్ధులకు బోధిస్తున్న వీడియోకూడా బాగా వైరల్ అవుతోంది. అందరి ప్రశంసలు అందుకుంది..ఈ వీడియో కోసం ఈ కింది ఆర్టికల్ లో చూడగలరు..ఈకింది ఆర్టికల్ క్లిక్ చేయగలరు..

Teacher Powerful Lesson : గుడ్ టచ్-బ్యాడ్ టచ్ గురించి చిన్నారులకు బోధిస్తూ అందరి ప్రశంసలు అందుకున్న టీచర్