Ujjain Man 28 Scissors : ఔరా.. ఒకేసారి 28 కత్తెర్లతో హెయిర్‌ కట్‌ చేస్తున్న హెయిర్‌ స్టయిలిస్ట్‌

అతను హెయిర్ స్టైల్ వేశాడంటే అద్దిరిపోవాల్సిందే. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒకేసారి 28 కత్తెరలతో హెయిర్ కటింగ్ చేసాడంటే తిరుగుండదు..రికార్డు సాధించాల్సిందే. అలాగే సాధించాడు ఓ రికార్డు..మరిన్ని కత్తెరలు పట్టుకుని మరిన్ని రికార్డులు సాధించటానికి రెడీ అంటున్నాడీ హెయిర్ స్టైలిస్ట్...

Ujjain Man 28 Scissors : ఔరా.. ఒకేసారి 28 కత్తెర్లతో  హెయిర్‌ కట్‌ చేస్తున్న హెయిర్‌ స్టయిలిస్ట్‌

Ujjain Man 28 Scissors

Updated On : June 26, 2023 / 12:24 PM IST

Ujjain man Hair Cut  28 scissors : ఈరోజుల్లో యువత రకరకాల హెయిర్ స్టైల్స్ తో పిచ్చెక్కించేస్తున్నారు. సెలబ్రిటీల హెయిర్ స్టైల్స్ ని ఫాలో అవుతుంటారు. దీని కోసం బార్బర్ వద్ద కెళ్లి ఇలాంటి హెయిర్ స్టైల్ కావాలి అలా ఉండాలి..అని వేయించుకుంటుంటారు. జుట్టుతో రకరకా విన్యాసాలు చేస్తు యువత వింత వింత హెయిర్ స్టైల్స్ తో ఆకట్టుకుంటుంటారు. హెయిర్ స్టైల్ చేసేవారు కూడా ఏమాత్రం తగ్గేదేలేదన్నట్లుగా తమ ప్రతాపం చూపిస్తుంటారు. ఎవరి స్టైల్ వారిది అన్నట్లుగా ఉంటారు. సాధారణంగా ఎవరైనా ఒకటి లేదా రెండు కత్తెరలతో హెయిర్ స్టైల్స్ చేస్తుంటారు.

కానీ ఉజ్జయిన్‌ (Ujjain)లోని అలఖ్‌ధామ్ నగర్ (Alakhdham Nagar)కు చెందిన ఓ హెయిర్‌ స్టయిలిస్ట్‌ (Hair stylist) మాత్రం వెరీ వెరీ డిఫరెంట్. ఒకటి కాదు రెండు కాదు పోనీ 10కూడా కాదు ఏకంగా 28 కత్తెరలతో హెయిర్ కటింగ్ (28 scissors)చేస్తు వారెవ్వా అనిపించుకుంటున్నాడు. హెయిర్‌ కటింగ్‌ను అందరూ ఒక కత్తెరతో చేస్తే…ఈ చలాకీ కుర్రాడు మాత్రం నా స్టైలే వేరు అంటూ ఏకంగా ఒకేసారి 28 కత్తెర్లతో (28 scissors) హెయిర్‌ కట్‌ (Hair Cut ) చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు.

Haryana Trees Pension : చెట్లకు పెన్షన్ ప్రకటించిన హర్యానా ప్రభుత్వం .. ఎందుకో తెలుసా..?!

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిన్‌కు చెంది ఆదిత్య దేవరా (Aditya devara)హెయిర్‌ స్టయిలిస్ట్‌గా పనిచేస్తున్నాడు. 18 ఏళ్ల వయసులోనే జుట్టు కత్తిరించడాన్ని వృత్తిగా చేసుకుని స్థానికంగా మంచి పేరు తెచ్చుకున్నాడు. లేటెస్ట్‌ హెయిర్‌ స్టయిల్స్‌తో కస్టమర్స్‌కు ఆకర్షిస్తున్నాడు ఆదిత్య. అంతేకాదు నాకంటూ ఓ స్పెషాలిటీ ఉండాలనుకున్నాడు. అలా ఓ వినూత్న ప్రయోగం చేశాడు. ఒకేసారి 28 కత్తెర్లను వినియోగించి హెయిర్‌ కట్‌ చేస్తున్నాడు. అన్ని కత్తెరలు పట్టుకుని అతను హెయిర్ కట్ చేస్తుంటే చూసేవారంతా నోరెళ్లబెడుతుంటారు. ఒకేసారి 28 కత్తెర్లలను వాడిని స్టైల్ మాత్రం ఏమాత్రం మిస్ అవ్వడు. దీనికోసం ఆదిత్య ఎన్నో రకాలుగా ట్రై చేసి చేసి మొత్తానికి అనుకున్నది సాధించాడు. ఒకేసారి 28 కత్తెరలతో తమాషాగా హెయిర్ కటింగ్ చేస్తు ఔరా అనిపించుకుంటున్నాడు.

హెయిర్‌ కటింగ్‌ తమకు వంశపారం పర్యంగా వస్తున్న వృత్తిగా పేర్కొన్నాడు ఆదిత్య. తమ కుటుంబ సభ్యులంతా ఇదే పనిచేస్తున్నారని చెప్పాడు. మొదట ఫైర్‌ హెయిర్‌ కటింగ్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చిందని… దీంతో వినూత్నంగా చేయాలన్న ఆలోచన తట్టిందన్నాడు ఆదిత్య. తన సోదరులు ఓ వీడియో చూపించారని…. అందులో చైనాకు చెందిన హెయిర్‌ స్టయిలిస్ట్- ఏకంగా 10 కత్తెరలను వినియోగించి హెయిర్‌ కటింగ్‌ చేయడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు ఆదిత్య. అప్పటి నుంచి తాను కూడా సాధన చేశానని…క్రమంగా కత్తెరల సంఖ్య పెంచుకుంటూ పోయానని అలా ప్రస్తుతం 28 కత్తెరలతో చేస్తున్నానని చెబుతున్నాడు.

AliExpress : పేరుకే ఎక్స్‌ప్రెస్ .. ఆర్డర్ ఇచ్చిన నాలుగేళ్లకు వచ్చిన పార్శిల్ .. ఆశ కోల్పోవద్దు అంటూ సూచన

ఆదిత్య చేసిన ఈ కసరత్తులు ఊరికేపోలేదు. ఏమాత్రం వృథా కాలేదు. లిమ్కా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ (limca book record)లో చోటు దక్కించుకున్నాడు. కానీ ఈ 28 కత్తెరతోనే కాదు ఇంకా ఇంకా ట్రైచేస్తానంటున్నాడు. 28 కత్తెరల నుంచి 32 కత్తెరలు, ఆ తర్వాత 40 కత్తెరల రికార్డ్‌ సాధించాలని ఉందని చెబుతున్నాడు ఆదిత్య. సుమారు వందకు పైగా కస్టమర్లపై తమ టెక్నాలజీ వినియోగించాడు ఈ హెయిర్‌ స్టయిలిస్ట్.

ఇతడి సోదరుడు ఏమాత్రం తీసిపోడు..ఆయన ఏకంగా కళ్లకు గంతలు కట్టుకుని మరీ హెయిర్‌ కటింగ్‌ చేయడంలో దిట్ట. ఇలా హెయిర్‌ స్టయిలిస్ట్‌ ప్రంపంచంలో వీరిద్దరు వినూత్న ప్రయోగాలతో కస్టమర్లను ఆకట్టుకుంటున్నారు. వీరిద్దరి చేసే హెయిర్ స్టైల్స్ తో వైరల్ అవుతున్నారు.