Fatima Sana Shaikh: దంగల్ భామ ఫాతిమా.. ఎక్కడా తగ్గట్లేదుగా!
అమిర్ ఖాన్ స్టోర్స్ డ్రామా ‘దంగల్’తో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఫాతిమా సనా షేక్ గుర్తుందా. ఈ మధ్య కాలంలో అమిర్ ఖాన్ భార్యతో విడాకుల సమయంలో కూడా ఈ పేరు బాగానే వినిపించింది

Fatima Sana Shaikh (All Images:Instagram)

అమిర్ ఖాన్ స్టోర్స్ డ్రామా ‘దంగల్’తో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న ఫాతిమా సనా షేక్ గుర్తుందా.

ఈ మధ్య కాలంలో అమిర్ ఖాన్ భార్యతో విడాకుల సమయంలో కూడా ఈ పేరు బాగానే వినిపించింది.

హైదరాబాద్‌లో పుట్టిన ఫాతిమా బాలనటిగా పలు హిందీ చిత్రాల్లో నటించింది.

ఆ తర్వాత 2015లో నువ్వు నేను ఒకటవుదాం సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది.

ఆ తర్వాత ఏడాదే 2016లో అమీర్ ఖాన్ ‘దంగల్’తో మళ్ళీ బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఫాతిమా దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

దంగల్ సినిమాలో అమీర్ కూతురిగా నటించిన ఫాతిమా.. ఆ వెంటనే థగ్స్ ఆఫ్ హిందోస్థాన్‌లో ఆయనతోనే జోడిగా నటించింది.

ఆ సినిమా షూటింగ్ లోనే కాదు ప్రమోషన్స్ లోనూ ఈ ఇద్దరూ చెట్టాపట్టేసుకొని రావడం..

అమ్మడి కెమెరాలకు ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్త ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి.

చివరికి అంబానీ ఇంట పెళ్ళికి, సినిమా వేడుకలకు కూడా జంటగా రావడంతో బాలీవుడ్ కోడై కూసింది.

ఆ తర్వాత ఫాతిమా హైదరాబాద్ నుండి ముంబైలో దిగిన ప్రతిసారి అమిర్ ఇంటికే వెళ్తుందంటూ బీటౌన్ కోడై కూసింది.

నో డౌట్ అమిర్ ప్రియురాలు ఫాతిమానే అని అందరూ ఫిక్స్ అవుతుండగానే అమిర్ భార్య కిరణ్ రావుతో విడాకుల అంశం తెరమీదకి వచ్చింది.

ఈ ఇద్దరి మధ్య ఏముంది అన్న నిజం వారికే ఎరుక కానీ.. ఫాతిమా మాత్రం ఇప్పుడు వరస ఫోటో షూట్స్ తో బాలీవుడ్ మేకర్స్ కు గాలం వేస్తుంది.

అసలే చీర కట్టినా.. జీన్స్ వేసినా అద్దిరిపోయే పర్సనాలిటీ కావడంతో అమ్మడి ఫోటోలకు సోషల్ మీడియాలో మంచి గిరాకీ ఉంటుంది.

అమ్మడి కెమెరాలకు ఇచ్చిన ఫోజులు సోషల్ మీడియాలో పెట్టడంతో అవి కాస్త ఎప్పటికప్పుడు వైరల్ అవుతున్నాయి.

నిండా మూడు పదులు కూడా నిండని ఈ హైదరాబాద్ బ్యూటీ ఇప్పుడు కెరీర్ మీద ఫోకస్ పెట్టింది

అందుకే ఇలా అప్పుడప్పుడు ఇలా షూట్స్ తో అలెర్ట్ చేస్తూ మేకర్స్ కు గాలమేస్తుంది.

మరి ఫాతిమా అందాలకు ఎవరైనా ఫిదా అయి దక్షణాదిలో అయినా ఛాన్స్ ఇస్తారా

Fatima Sana Shaikh (All Images:Instagram)

Fatima Sana Shaikh (All Images:Instagram)