Gold Silver Rates Today : బంగారం కొనేవాళ్లకు అదిరిపోయే శుభవార్త.. నిపుణుల కీలక సూచనలు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Silver Rates Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి శుభవార్త. ఇవాళ గోల్డ్ రేటు తగ్గింది.

Gold Silver Rates Today : బంగారం, వెండి ధరల్లో రోజురోజుకు కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం బంగారం ధర భారీగా పెరగ్గా.. ఇవాళ తగ్గింది. అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ మార్పులు చోటు చేసుకుంటున్నాయని నిపుణులు చెబుతున్నారు.

గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ. 280 తగ్గగా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 250 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 28డాలర్లు తగ్గగా.. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,033 డాలర్ల వద్ద కొనసాగుతోంది. మరోవైపు.. వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,43,290 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,31,350 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,440 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,31,500 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,43,460కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,31,500 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,40,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,35,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,40,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు
