Harish Shankar : నా వల్లే సినిమా లేట్ అయింది.. రిలీజ్ డేట్ మార్చమని అడిగారు.. హరీష్ స్పీచ్..

ఈ సినిమా ఆలస్యంపై, సినిమా గురించి నేడు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో హరీష్ శంకర్ మాట్లాడారు. (Harish Shankar)

  • Published On : March 16, 2026 / 12:10 AM IST

Harish Shankar

Harish Shankar : హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 19న ఉగాది రోజు రిలీజ్ కానుంది. నేడు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది.

ఈ సినిమా ఎప్పుడో మొదలయిన చాలా లేట్ అయిన సంగతి తెలిసిందే. పవన్ రాజకీయాలతో బిజీగా ఉండటం వల్ల కూడా ఈ సినిమా లేట్ అయింది. ఈ సినిమా ఆలస్యంపై, సినిమా గురించి నేడు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో హరీష్ శంకర్ మాట్లాడారు.

Also Read : Pawan Kalyan : టికెట్ రేట్ల పెంపు పై మాట్లాడిన పవన్.. వేరే హీరోలకు నా కంటే ఎక్కువే పెంచాను..

హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా లేట్ అయింది. దానికి చాలా మంది చాలా అనుకున్నారు. ఎందుకు లేట్ అయిందో చెప్తాను. కరోనా ముందు ఖుషి కి సీక్వెల్ గా ఒక కథ అనుకున్నాను కానీ అందులో కమర్షియాలిటీ తగ్గింది అని ఆ స్క్రిప్ట్ పక్కన పెట్టాను. ఆ తర్వాత వేరే కథ రాసుకున్నాను. ఈ సినిమా లేట్ అవ్వడానికి, ఈ సినిమా షూట్ మొదలుపెట్టాక త్వరగా షూట్ అవ్వడానికి కూడా నేనే కారణం. ఈ సినిమా కథ మారినా, నా కోసం రైటర్లు రెండున్నరేళ్లు కూర్చొని నాతో పనిచేసారు. దేవిశ్రీ బిజీగా ఉన్నారు. అందుకే ఇక్కడికి రాలేదు. దేవిశ్రీ బిజీగా ఉండటం వల్లే థమన్ తో మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ చేయించాము.

ఉగాదికి తెలుగు సినిమా ఒక్కటి కూడా రిలీజ్ లేదు అని డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు అందరూ నాకు, నిర్మాతలకు ఫోన్స్ చేసి ఆ రోజు రిలీజ్ చేయమని అడిగారు. ఇది సినీ పరిశ్రమ అంతా కలిసి తీసుకున్న నిర్ణయం ఇది. దాంతో అప్పటికప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఇంకా వేగం పెంచాము. నేను, నా దిరెచ్తిఒన్ టీమ్ పడుకోకుండా పనిచేస్తున్నాము. గబ్బర్ సింగ్ లో కెవ్వుకేక సాంగ్ అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు ఆయన్ని పెట్టి ఐటెం సాంగ్ చేయకూడదు. కానీ ఆయనతో డ్యాన్స్ వేయించాను. ఆయన వన్ మోర్ అని అడిగి మరీ డ్యాన్స్ చేసారు ఈ సినిమాలో. నేను మానసికంగా చాలా బాధలో ఉన్నప్పుడు, కరోనా, ముందు సినిమా ఫ్లాప్ అవ్వడం, సినిమా ఆగడం.. ఇలా అంతా లో ఉన్నప్పుడు నా దేవుడు పవన్ కళ్యాణ్ పిలిచి సినిమా మొదలుపెట్టుకో అన్నారు. నాకు ఊపిరి లేచి వచ్చింది. నా గుండె లోపల, నా గుండె బయట, నా గుండె ధైర్యం కూడా పవన్ కళ్యాణ్ గారే అని అన్నారు.

Also See : Ustaad Bhagat Singh : పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఫొటోలు..