Samsung Festive Cheer Sale : శాంసంగ్ ఫెస్టివ్ చీర్ సేల్.. ఈ శాంసంగ్ గెలాక్సీ S24 సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్లే డిస్కౌంట్లు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టేసుకోండి!

Samsung Festive Cheer Sale : శాంసంగ్ సేల్ సందర్భంగా గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ S24, గెలాక్సీ S24 FE ఫోన్లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు.

1/8Samsung Festive Cheer Sale
Samsung Festive Cheer Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? శాంసంగ్ ఇండియా ఫెస్టివ్ చీర్ సేల్‌ను ప్రకటించింది. వివిధ ధరల కేటగిరీలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది.
2/8Galaxy A35 5G
ఆసక్తిగల కొనుగోలుదారులు (Samsung Festive Cheer Sale) శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ S24, గెలాక్సీ S24 FE, గెలాక్సీ A55, గెలాక్సీ M36 మరిన్నింటితో సహా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను పొందవచ్చు. ఈ సేల్ సెప్టెంబర్ 22న అర్ధరాత్రి నుంచి Samsung.com వెబ్ సైట్ ద్వారా అందుబాటులో ఉంటుంది.
3/8Galaxy A55 5G
మీరు శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా కోసం చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్.. ఈ శాంసంగ్ ఫోన్లు లాంచ్ ధర కన్నా తగ్గింపు ధరకే లభిస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ S24, గెలాక్సీ S24 FE వంటి అన్ని శాంసంగ్ ఫోన్లపై ఎంత ఆదా చేయవచ్చో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
4/8Samsung Galaxy S24FE
శాంసంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, గెలాక్సీ S24, గెలాక్సీ S24 FEపై డిస్కౌంట్లు : ఈ సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ S24 లైనప్ కలిగి ఉంది. రూ.1,29,999కి లాంచ్ అయిన గెలాక్సీ S24 అల్ట్రా కేవలం రూ.71,999కే లభిస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ ప్రారంభ లాంచ్ ధర కన్నా రూ.58వేలు తక్కువ. ఒక జనరేషన్ పాతది అయినప్పటికీ ఈ ఫోన్ ఇప్పటికీ ఫుల్ డిమాండ్ ఉంది. 
5/8Samsung Galaxy S24 Prices
శాంసంగ్ గెలాక్సీ S24 ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌ కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోన్ ధర రూ.74,999 నుంచి రూ.39,999కి తగ్గింది. అత్యంత సరసమైన ఫ్లాగ్‌షిప్‌ ఫోన్ రూ.59,999కి ఇంటికి తెచ్చుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S24 FE ధర కూడా దాదాపు 50శాతం తగ్గుదలతో కేవలం రూ.29,999కే కొనేసుకోవచ్చు.
6/8Samsung Galaxy S24FE
గెలాక్సీ A55 5G, గెలాక్సీ A35 5Gపై డిస్కౌంట్లు : శాంసంగ్ A-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు మిడ్-రేంజ్ కేటగిరీలో అత్యుత్తమ ఆప్షన్లలో ఒకటి. శాంసంగ్ గెలాక్సీ A55 5G ఫోన్ రూ.39,999 నుంచి రూ.23,999 కు అందుబాటులో ఉంటుంది. అయితే, శాంసంగ్ గెలాక్సీ A35 5G ప్రారంభ ధర రూ.30,999 నుంచి రూ.17,999కు తగ్గింపుతో పొందవచ్చు.
7/8Samsung Galaxy S24
గెలాక్సీ M-సిరీస్ ఫోన్‌లపై డిస్కౌంట్లు : బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ కోసం చూసేవారికి శాంసంగ్ గెలాక్సీ M36 5G ధర రూ.19,999 నుంచి రూ.13,999కి తగ్గుతుంది. అయితే, శాంసంగ్ గెలాక్సీ M16 5G ధర రూ.13,499 లాంచ్ ధర నుంచి రూ.10,499కి తగ్గుతుంది. శాంసంగ్ గెలాక్సీ M06 5G కేవలం రూ.7,499కి అమ్ముడవుతోంది.
8/8Samsung Galaxy S24 Ultra
గెలాక్సీ F-సిరీస్ ఫోన్లపై డిస్కౌంట్లు : శాంసంగ్ F సిరీస్‌పై కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. గెలాక్సీ F36 5G ధర ఇప్పుడు రూ.19,999 నుంచి రూ.13,999కు తగ్గింది. శాంసంగ్ గెలాక్సీ F06 5G ధర రూ.7,499కు తగ్గింది.