Yamini Bhaskar : ఇండస్ట్రీకి వచ్చిన పదేళ్ల తర్వాత ఫేమ్.. మళ్ళీ హీరోయిన్ గా తెలుగమ్మాయి.. యామిని భాస్కర్ క్యూట్ చబ్బీ లుక్స్..
తెలుగమ్మాయి యామిని భాస్కర్ 2015 లో కీచక సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కాటమరాయుడు, నర్తనశాల, రభస.. ఇలా చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా నటిస్తూ వచ్చింది. కరోనాతో కొంత గ్యాప్ రాగా యామిని ఇప్పుడు నందు సరసన సైక్ సిద్దార్థ్ సినిమాతో మళ్ళీ హీరోయిన్ గా కనిపించబోతుంది. ఈ సినిమాలో యామిని ఒక బాబుకి తల్లి పాత్రలో కనపడటం గమనార్హం. ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజవుతుండగా ప్రమోషన్స్ లో ఇలా చబ్బీ లుక్స్ లో కనిపించి క్యూట్ గా వైరల్ అవుతుంది.
































