ఏపీలో 19 కంపెనీలు : ఐటీ రంగంలో 3 వేల ఉద్యోగాలు

  • Publish Date - November 4, 2019 / 03:34 AM IST

ఏపీలో ఒకే రోజు 19 కంపెనీలకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. తద్వారా ఐటీ రంగంలో 3 వేల ఉద్యోగాలు రానున్నాయి. ప్లగ్ అండ్ ప్లే విధానంలో ఆయా కంపెనీలు నెల రోజుల్లో కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి. విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి నగరాల్లో కంపెనీలు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో ఐటీ కంపెనీలో సుమారు 150 నుంచి 200 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంది. కొద్ది నెలలుగా కంపెనీల ఏర్పాటు ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయని, అనుమతుల కమిటీ సమావేశంలో ఆమోదించిన కంపెనీలన్నీ నెల రోజులుగా ఉద్యోగాలు కల్పిస్తాయని తెలిపారు మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి. 

ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాల కల్పన విషయంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే నియామకాలు చేశారు. గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసిన ట్రిపుల్ ఐటీలను పూర్వవైభవం తీసుకొస్తామని హామినిచ్చారు. ఐటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పలు సందర్భాల్లో ఆయన వెల్లడించారు. వీటిని మరింత అభివృద్ధి చేసి..ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.
Read More : దేశ చిత్రపటంలో అమరావతికి చోటెక్కడ ?