వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా ప్రకటన వాయిదా
మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేర్పులతో జాబితా రిలీజ్ చేశారు. రెండో విడతలో 27 స్థానాల్లో మార్పులు చేశారు జగన్.

YCP Third List Postponed
YCP Third List : వైసీపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదల వాయిదా పడింది. వైసీపీ ఇంఛార్జిల మార్పుల చేర్పులకు సంబంధించి మూడో లిస్టు ప్రకటనను వాయిదా వేసింది వైసీపీ అధిష్టానం. మరికొన్ని స్థానాలపై స్పష్టత రాకపోవడంతో లిస్టు విడుదలను వాయిదా వేశారు. రేపు లేదా ఎల్లుండి వైసీపీ మూడో జాబితాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా.. మూడో జాబితాలో 14 స్థానాల్లో సీఎం జగన్ మార్పులు చేర్పులు చేశారని వార్తలు వచ్చాయి. మూడో లిస్టును సీఎం జగన్ ఫైనల్ చేసేశారని, కాసేపట్లో ఆ జాబితాను విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. చివరి నిమిషంలో జాబితా ప్రకటనను వాయిదా వేశారు.
Also Read : గెలుస్తున్నాం.. గెలిచేస్తున్నాం.. ఇప్పుడిదే విజయ రహస్యం, ఎన్నికల ఫలితాలను శాసిస్తున్న ఫీల్ ఫ్యాక్టర్
ఇప్పటివరకు 38 స్థానాల్లో ఇంఛార్జిల మార్పులు చేశారు జగన్. మొదటి విడతలో 11 స్థానాల్లో మార్పులు చేర్పులతో జాబితా రిలీజ్ చేశారు. రెండో విడతలో 27 స్థానాల్లో మార్పులు చేశారు జగన్. అయితే మొదటి జాబితాలో ఎక్కడా కూడా ఎంపీ స్థానాలు ప్రకటించ లేదు. రెండో జాబితాలో మాత్రం మూడు ఎంపీ స్థానాల్లో మార్పులు చేశారు.