60 వేల కోట్లతో సీమను సస్యశ్యామలం చేస్తా : సీఎం జగన్

  • Publish Date - December 23, 2019 / 09:09 AM IST

రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు 60 వేల కోట్ల రూపాయలతో నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టబోతున్నామనిసీఎం జగన్ మోహన్ రెడ్డిచెప్పారు.  కడపజిల్లాలో  కుందూ నదిపై నిర్మిచే 3  రిజర్వాయర్లకు ఆయన సోమవారం డిసెంబర్ 23న దువ్వూరు మండలం నేలటూరు వద్ద   శంకుస్ధాపన చేశారు.

జోలదరాసి వద్ద 0,8టీఎంసీల సామర్ధ్యంతో రిజార్వాయరు…రాజోలి ఆనకట్టఎగువును 2.95టీఎంసీలనీటి సామర్ధ్యంతో మరో రిజర్వాయరు  నిర్మించనున్నారు. ఈ రిజర్వాయర్లు పూర్తయితే కడప, కర్నూలు జిల్లాలు సస్యశ్యామలం అవుతాయని ఆయన చెప్పారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంవల్లనే డ్యాంలు నింపుకోలేక పోయామని.. కుందూ నదికి వచ్చే వరదను నివారిస్తామని హామీ ఇచ్చారు. 2,65,628 ఎకరాల కేసీకెనాల్ ఆయకట్టు రక్షిచేందుకు ప్రణాళిక రూపోందిస్తున్నాం అని  సీఎం జగన్ చెప్పారు. 
 

జిల్లాలోని ప్రాజెక్టుల నీటిసామర్ధ్యం పెంచేందుకు ప్రణాళికలు రూపోందిస్తున్నామన్నారు.దువ్వూరు నుంచి బ్రహ్మాసాగర్ జలాశయానికి నీటిని తరలించటం వల్ల తెలుగు గంగ ఆయకట్టు స్ధిరీకరణ జరుగుతుందని..తెలుగుగంగ రిజర్వాయరు సామర్ధ్యాన్ని 11వేల 500 క్యూసెక్కులకు  నుంచి 18వేల క్యూసెక్కులకు  పెంచుతామని చెప్పారు. కేసీకెనాల్ నిప్పుల వాగు ప్రస్తుతం ఉన్న 12500 క్యూసెక్కుల నుంచి 35 వేల క్యూసెక్కులు పెంచుబోతున్నాం…ఎస్ఆర్బీసీ –జీఎన్ఎస్ఎస్  21700 నుంచి 30 వేల క్యూసెక్కులకు పెంచబోచతున్నాం…హంద్రీనావా కాలువ ప్రస్తతం 2వేల 200 క్యూసెక్కులకు కూడా నీరు అందటం లేదు దాన్ని 6వేల క్యూసెక్కులకు పెంచబోతున్నాం….గండికోట నుంచి చిత్రావతికి 2వేల నుంచి 4 వేల క్యూసెక్కులు పెంచుతున్నామని ఆయన వివరించారు. 

అంతకు ముందు ఆయన  జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో కడప ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేశారు. జిల్లాలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేయడం తన జీవితంలో మరచిపోలేని రోజని సీఎం జగన్ అన్నారు. జిల్లాకు స్టీల్‌ ప్లాంటు రావాలని.. అభివృద్ధి బాటలో పరుగులు పెట్టాలని చాలా ఏళ్లుగా అనుకున్నాం. నాన్నగారి హయాంలో జిల్లా అబివృద్ధికి బీజాలు పడ్డాయి. కానీ ఆయన చనిపోయిన తరువాత జిల్లా అభివృద్ధిని పట్టించుకునేవారే లేకుండా పోయారని అన్నారు.
 

సరిగ్గా ఎన్నికలకు ఆరు నెలల ముందు ఒక పెద్ద మనిషి వచ్చి టెంకాయ కొట్టాడు. ఐదేళ్లు పాలించడానికి ప్రజలు అధికారమిస్తే.. నాలుగేళ్లు ఏమి చేయకుండా ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే మోసం అంటారు. అదే అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే టెంకాయ కొడితే చిత్తశుద్ధి అంటారు. పాలనలో తేడాను ప్రజలు గమనించాలి.

ఈ పరిశ్రమ ద్వారా ప్రత్యక, పరోక్షంగా 25వేల మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి నెలకొంటుంది. అక్షరాల రూ. 15 వేలకోట్ల రూపాయలతో పునాదిరాయి వేశాం. స్టీల్‌ ప్లాంట్‌కు కావాల్సిన ఐరన్‌ ఓర్‌ కోసం ఎన్‌ఎండీసీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంద’ని తెలిపారు. 

ట్రెండింగ్ వార్తలు