దళారులకు చెక్ : ఔట్ సోర్సింగ్ కార్పోరేషన్ ఏర్పాటు

  • Publish Date - October 16, 2019 / 10:08 AM IST

ఏపీ లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం పత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  రాష్ట్ర  ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో వందలాది మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పని చేస్తున్నారు. ప్రస్తుతం వివిధ ఏజెన్సీల ద్వారా వీరిని నియమిస్తున్నారు.

వీరి కోసం ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేసి, వీరికి చెల్లించే వేతనాలు డైరెక్టు గా వారి బ్యాంకు ఖాతాలోనే వేయాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. తద్వారా మధ్యవర్తులు ప్రమేయం తగ్గించి వారికి నేరుగా లబ్ది చేకూరుతుందని కేబినెట్ అభిప్రాయపడింది. 

ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త సంక్షేమ పథకాల విధివిధానాలపై మంత్రివర్గం చర్చలు జరిపి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.  కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి పేర్ని నాని విలేకరులకు తెలిపారు.