హౌసింగ్, మున్సిపల్ శాఖల్లోనూ రివర్స్ టెండరింగ్

రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ లలో సీఎం జగన్ చేపట్టిన రివర్స్ టెండరింగ్ సక్సెస్ అయిందని .రాష్ట్ర జల వనరుల శాఖమంత్రి అనిల్ కుమార్‌యాదవ్ అన్నారు. తద్వారా ఇరిగేషన్ శాఖలో దాదాపు వేయి కోట్ల రూపాయలు ఆదా చేశాంమని ఆయన తెలిపారు. త్వరలో హౌసింగ్,మున్సిపల్ శాఖలలో కూడా రివర్స్ టెండరింగ్ కు వెళ్లనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా లోని వెలిగొండప్రాజెక్ట్‌కు రివర్స్ టెండరింగ్ ద్వారా 61 కోట్ల రూపాయలు ఆదాఅయిందని మంత్రి అన్నారు.
ఇప్పటికే వేయి కోట్లు మిగలగా రాబోయే రోజులలో రివర్స్ టెండరింగ్ ద్వారా మరో 500 కోట్లు మిగులుతాయని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రిత్విక్ సంస్దకు 4.69 శాతం ఎక్సెస్ తో వెలిగొండ ప్రాజెక్టు కట్టబెట్టారని ఆయన విమర్శించారు. కమీషన్ల కోసం ఇష్ట వచ్చినట్లు నిభందనలు పెట్టి చంద్రబాబు ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉన్నవారికి టెండర్లు కేటాయించిందన్నారు.
సీఎం జగన్ రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తుందని అనిల్ కుమార్ తెలిపారు. ప్రాజెక్టుల్లో పారదర్శకంగా టెండరింగ్ ప్రక్రియ జరగాలనేది ముఖ్యమంత్రిగారి లక్ష్యమని…జగన్ సీఎం అయ్యాక డ్యామ్ లు నిండాయి.పంటలు పండి కళకళలాడుతున్నాయని మంత్రి వివరించారు. రివర్స్ టెండరింగ్ లో వందలకోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదా అవుతుంటే ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారని ఆయన అన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదా అవుతున్న మొత్తాన్ని ప్రజాసంక్షేమానికి వినియోగిస్తామని అనిల్ కుమార్ చెప్పారు. కృష్ణా,గోదావరి నదులలో వరదలు రావడంతో ఇసుక లభ్యతలో ఇబ్బంది ఏర్పడిందని త్వరలోనే ఇసుక సమస్యకు పరిష్కారం చూపుతామని మంత్రి చెప్పారు.