’పాదయాత్ర ముగింపు సభ కాదు.. వైసీపీ ముగింపు యాత్ర సభ’ : దేవినేని 

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

  • Publish Date - January 10, 2019 / 07:15 AM IST

వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

విజయవాడ : వైసీపీ అధినేత జగన్ పై ఏపీ మంత్రి దేవినేని ఉమా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ’నిన్న జరిగింది పాదయాత్ర ముగింపు సభ కాదు.. వైసీపీ ముగింపు యాత్ర సభ’ అని ఎద్దేవా చేశారు. ఇక జగన్ కాశీ యాత్ర చేపట్టాలని ఉచిత సలహా ఇచ్చారు. కాశీ యాత్రలో జగన్ కు మోడీ కూడా తోడవుతాడని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాస్తవాలు ఒప్పుకోని స్థితిలో జగన్ ఉన్నారని విమర్శించారు. ఈమేరకు విజయవాడలో దేవినేని మీడియాతో మాట్లాడారు.

పాదయాత్ర ముగింపు సభలో జగన్ అవాస్తవాలు మాట్లాడరాని పేర్కొన్నారు. జగన్ చెప్పే అసత్యాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. ఇకనైనా పశ్చాతాప పడి ప్రజల ముందు వాస్తవాలు ఒప్పుకోవాలని హితవుపలికారు. హెరిటేజ్, చంద్రబాబు కుటుంబంపై విమర్శలు తప్పా జగన్ కు ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు జగన్ కు కనిపించట్లేదని అన్నారు. జగన్, మోడీ, కేసీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. జయప్రకాశ్ కమిటీ కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.85 వేల కోట్లు రావాలని చెప్పిందని తెలిపారు.