Gudivada Amarnath : ఏపీ ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలకు మంత్రి అమర్నాథ్ కౌంటర్

ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. బీహార్ లో చెల్లని రూపాయి వచ్చి ఇక్కడ రూపాయలు సంపాదించుకోవాలనే ప్రయత్నం కనబడుతోందని విరుచుకుపడ్డారు.

Gudivada Amarnath Counter To Prashant Kishor

Gudivada Amarnath : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేసిన సంచలన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయవర్గాల్లో దుమారం రేపుతున్నాయి. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, వైసీపీ ఓడిపోతుంది అంటూ ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. చదువుకున్న వారు ఉద్యోగాలు కోరుకుంటారు, ఉచితాలు కాదంటూ ప్రశాంత్ కిశోర్ చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. ప్రశాంత్ కిశోర్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు ఎదురుదాడికి దిగారు. ఆయన కామెంట్స్ కు ఏపీ మంత్రి అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు.

”ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం జగన్ నాయకత్వంలో రెండున్నర లక్షల కోట్ల పైచిలుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ ద్వారా పేదవాడికి మంచి చేసే కార్యక్రమం చేశామో దాని వల్ల ఓట్లు రావు, దాని వల్ల వైసీపీ గెలవడం కష్టం అనే మాట అన్నారు. మరి ఇదే నిజమై ఉంటే.. మరి ఆయన ఎందుకు చంద్రబాబుకి సూపర్ సిక్స్ అనే పథకాల ప్లాన్ ఇచ్చారు? ఏడాదికి దాదాపు లక్ష 20వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పథకాలను ఎందుకు సలహా ఇచ్చారో అది కూడా చెప్పి ఉండాల్సింది. గెలుస్తాను అనే నమ్మకం చంద్రబాబుకి ఉండి ఉంటే.. పవన్ కల్యాణ్ తోనో, లేక బీజేపీతోనో పొత్తులు పెట్టుకోమని ఎందుకు సలహా ఇచ్చారో అది కూడా ప్రశాంత్ కిశోర్ చెప్పి ఉంటే బాగుండేది.

గడిచిన ఐదేళ్లుగా వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సర్వీస్ సెక్టార్, సంక్షేమం.. ఇవన్నీ ముందుకి తీసుకెళ్లిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. మరి ఇన్ని చేస్తున్న ప్రభుత్వమే గెలవదు అనే మాట ఈ మాయల ఫకీరు చెప్పి ఉంటే.. మరి గతంలో సంక్షేమం లేదు, అభివృద్ది లేదు.. మరి ఆయన గెలుస్తాడు అనే మాట ఈయన ఎలా చెబుతున్నాడు? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అనేది మర్చిపోయారు.

పీకే వచ్చి బహిరంగంగా చంద్రబాబుని కలిశారు. చంద్రబాబుని కలిశాక జరుగుతున్న పరిణామాలు చూస్తున్నాం. వారు మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం. ఈ నెల రోజుల్లో అనేక మార్లు హైదరాబాద్ లో చంద్రబాబును రహస్యంగా కలిశారు. ఇవన్నీ చూస్తుంటే.. బీహార్ లో చెల్లని రూపాయి వచ్చి ఇక్కడ రూపాయలు సంపాదించుకోవాలనే ప్రయత్నం కనబడుతోంది. అందులో భాగంగానే ఈ రకమైన స్టేట్ మెంట్స్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే ప్రజల అభిప్రాయం కూడా. ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తెచ్చుకున్నారు చంద్రబాబు. పీకే-1, పీకే-2. నిన్న కూడా పీకే చంద్రబాబుని కలిసినట్లు సమాచారం. దాదాపు 3 గంటల పాటు చంద్రబాబుతో సమావేశం అయ్యారని తెలుస్తోంది. ఇంట గెలవని వ్యక్తి రచ్చ గెలుద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్న పీకే.. ఈ రోజు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రజల మైండ్ సెట్ ని తన స్టేట్ మెంట్ తో మార్చాలనే ప్రయత్నం కనిపిస్తోంది. అది జరగని పని.

బీహార్ లో మన పరిస్థితి, మన రాజకీయ పరిస్థితి ఏంటి? బీహార్ లో ప్రశాంత్ కిశోర్ రాజకీయ పార్టీకి ఏదైతే పరిస్థితి ఉందో.. ఇవాళ ఏపీలో చంద్రబాబుకి అదే పరిస్థితి ఉంది. ఈ రెండు చెల్లని రూపాయిలు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి, రాష్ట్ర రాజకీయాల గురించి, రాష్ట్ర ప్రజల ఉద్దేశం గురించి మాట్లాడటం హాస్యాస్పదం. పీకే ఏమైనా మాటల మాంత్రికుడా? మాయల మాంత్రికుడా? ప్రశాంత్ కిశోర్ చెప్పేశాడు కాబటి అందరూ ఆయన చెప్పినట్టే చేసేస్తాం అంటారా?

వైసీపీ ఓడిపోతుంది అనే గట్ ఫీలింగ్ ఆయనకు ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల 30లక్షల మంది ప్రజలకు తెలుగుదేశం పార్టీ వాటి మిత్రపక్షాలు చిత్తుచిత్తుగా ఓడిపోతాయి అనే గట్ ఫీలింగ్ ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. బీహార్ నుంచి వచ్చిన వ్యక్తి చెప్పిన గట్ ఫీలింగ్ ను తీసుకుంటామా? రాష్ట్రంలో సంక్షేమాన్ని అందుకున్న పేదవాడు, మేలు జరిగినటువంటి పేదవాడు, జగన్ నాయకత్వంలో మేలు పొందిన పేద కుటుంబాల గట్ ఫీలింగ్ ను పరిగణలోకి తీసుకుంటామా?” అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు.

పీకేపై మంత్రి అమర్నాథ్ కామెంట్స్..
* బీహార్ కు చెందిన ప్రశాంత్ కిశోర్ ప్రజలను ఏమార్చేందుకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తన గట్ ఫీలింగ్ అంటూ ఏవో మాట్లాడారు.
* టీడీపీ-జనసేన కూటమి కూడా చిత్తు చిత్తుగా ఓడిపోతుందని రాష్ట్ర ప్రజల గట్ ఫీలింగ్.
* సంక్షేమ పథకాలు అమలు చేస్తే ప్రభుత్వాలు మళ్లీ రావడం ఇబ్బందని ఎందుకు చెప్పారో పీకే వివరించాలి.
* అలాంటప్పుడు చంద్రబాబుకు సూపర్ 6 అనే పథకాలను అమలు చేయాలని ఎందుకు సలహా ఇచ్చారో చెప్పాలి.
* టీడీపీ గెలుస్తుందని నమ్మకం ఉండి ఉంటే జనసేన, బీజేపీతో పొత్తు ఎందుకు పెట్టుకోమన్నారో ఆయనే చెప్పాలి.
* ప్రశాంత్ కిషోర్ రహస్యంగా చంద్రబాబును హైదరాబాద్ లో ఎందుకు కలిశారో చెప్పాలి.
* తాను ఇచ్చే స్టేట్ మెంట్ తో ప్రభుత్వాన్ని మార్చడం జరగని పని.
* ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకే-2ను చంద్రబాబు తెచ్చుకున్నారు.
* బీహార్ లో కూడా ప్రశాంత్ కిషోర్ చిత్తు గా ఓడిపోతాడని నా గట్ ఫీలింగ్.
* బీహార్ లో ప్రశాంత్ కిషోర్ లానే చంద్రబాబు కూడా ఆంధ్రలో చెల్లని రూపాయి.
* ప్రశాంత్ కిషోర్ గతంలో ఐ-ప్యాక్ డైరెక్టర్ గా మాకు పొలిటికల్ కన్సల్టెన్సీ చేశారు
* ప్రస్తుతం బీహార్ రాజకీయ నేతగా ఉన్న పీకేను చంద్రబాబు కొనుగోలు చేశారు కాబట్టే ఆయన అలా మాట్లాడాల్సి వస్తోంది.
* పీకే ఇప్పుడు రాజకీయ నాయకుడు. రాజకీయ వ్యూహకర్త కాదు.

Also Read : వైసీపీ వర్సెస్ టీడీపీ.. నెల్లూరులో జోరుమీదున్న పార్టీ ఏది?

 

ట్రెండింగ్ వార్తలు