జాగ్రత్తగా ఉండండి.. ఎమ్మెల్యేలకు కేసీఆర్ హెచ్చరిక

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం అంత సులువు కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుందన్నారు.

KCR Warns BRS MLAS

KCR : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కేసీఆర్ భేటీ ముగిసింది. తమ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. పలు జాగ్రత్తలు చెప్పారు. సూచనలు ఇచ్చారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు జాగ్రత్తగా ఉండాలని, కాంగ్రెస్ నేతల ట్రాప్ లో పడొద్దని కేసీఆర్ సూచించారు. మంచి ఉద్దేశ్యంతో మీరు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసినా మీ క్యారెక్టర్ ను బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు కేసీఆర్.

నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం మంత్రులకు వినతి పత్రాలు ఇవ్వండి, అందులో తప్పు లేదన్న కేసీఆర్.. ఆ వినతిపత్రాలను మంత్రులు జనం మధ్యలో ఉన్నప్పుడే, ప్రజల సమక్షంలోనే ఇవ్వాలని కేసీఆర్ చెప్పారు. మీరు మంచి ఆలోచనలతో ప్రభుత్వంలోని వారిని కలిసినా ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని కేసీఆర్ హెచ్చరించారు.

Also Read : అదృష్టం బాగుంటే నేను మళ్లీ మంత్రి కావొచ్చు- మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఇక, హామీల అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమయం ఇద్దామని కేసీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడం అంత సులువు కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుందన్నారు. ప్రజలు బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం కోల్పోలేదన్న కేసీఆర్.. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల మద్దతు బీఆర్ఎస్ కు దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధిస్తామని గులాబీ బాస్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సిద్ధం కావాలని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు కేసీఆర్.

Also Read : లోక్‌సభ ఎన్నికల రేసులో భట్టి విక్రమార్క భార్య నందిని.. గాంధీ భవన్‌లో కొనసాగుతున్న అప్లికేషన్ల స్వీకరణ