లోక్‌సభ ఎన్నికల రేసులో భట్టి విక్రమార్క భార్య నందిని.. గాంధీ భవన్‌లో కొనసాగుతున్న అప్లికేషన్ల స్వీకరణ

ఖమ్మం పార్లమెంట్ సీటుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని విక్రమార్క దరఖాస్తు చేసుకున్నారు.

లోక్‌సభ ఎన్నికల రేసులో భట్టి విక్రమార్క భార్య నందిని.. గాంధీ భవన్‌లో కొనసాగుతున్న అప్లికేషన్ల స్వీకరణ

Mallu Bhatti Vikramarka-Nandini

Nandini Bhatti: లోక్‌సభ ఎన్నికలకు మరి కొన్ని నెలలే సమయం ఉన్న వేళ హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో కాంగ్రెస్ ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. నిన్న ఏడుగురు ఆశావహ అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం పార్లమెంట్ సీటుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భార్య నందిని విక్రమార్క దరఖాస్తు చేసుకున్నారు.

అలాగే, మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. ఫిబ్రవరి 3 వరకు ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అప్లికేషన్ల స్వీకరణకు గాంధీ భవన్లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు.

ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులంతా గాంధీ భవన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో నిన్న పలు స్థానాల నుంచి ఆవావహులు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల్లో వ్యక్తిగత, రాజకీయ వివరాలను కూడా అడుగుతున్నారు. జనరల్ అభ్యర్థులు రూ.50 వేలు.. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.25 వేలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది.