అదృష్టం బాగుంటే నేను మళ్లీ మంత్రి కావొచ్చు- మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు
రాష్ట్ర రాజకీయాల్లో ఐదేళ్లలో ఏదైనా జరగొచ్చన్న మల్లారెడ్డి.. అదృష్టం బాగుంటే తాను మళ్లీ మంత్రి కావొచ్చని చెప్పారు.

Malla Reddy Sensational Comments
CH Malla Reddy : మాజీమంత్రి మల్లారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తాము ఓడిపోతామని, కాంగ్రెస్ గెలుస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. తాము ఇంకా షాక్ నుంచి తేరుకోలేదని తెలిపారు మల్లారెడ్డి. మల్కాజ్ గిరి ఎంపీగా తాను పోటీ చేయాలని అధిష్టానం కోరిందన్నారు. కానీ, తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. రాష్ట్ర రాజకీయాల్లో ఐదేళ్లలో ఏదైనా జరగొచ్చన్న మల్లారెడ్డి.. అదృష్టం బాగుంటే తాను మళ్లీ మంత్రి కావొచ్చని చెప్పారు.
ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి మల్లారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కాసేపు మీడియాతో చిట్ చాట్ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతుందని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలో వస్తుందనే ధీమాతో మేమంతా ఉన్నామని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూశాక షాక్ కొట్టినంత పనైందని మల్లారెడ్డి అన్నారు. ఇక, ఇటీవల కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలవడాన్ని మల్లారెడ్డి సమర్థించారు. తాను కూడా ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ది పనుల విషయమై సీఎం రేవంత్ ను కలవడంలో తప్పేముంది? అని ఆయన ప్రశ్నించారు.
Also Read : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కన్ఫూజన్.. అయోమయంలో నేతలు
ఇక, ఎంపీ టికెట్ కోసం తనను పార్టీ పెద్దలు పోటీ చేయమని కోరితే.. తన కుమారుడిని రంగంలోకి దించుతానని పార్టీకి తన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు తెలిపారు. కాగా, దీనికి సంబంధించి పార్టీ పరంగా ఇంతవరకు ఎలాంటి నిర్ణయం జరగలేదన్నారు మల్లారెడ్డి. మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ఎవరికి ఇస్తారు అనేదానిపై ఇంకా స్పష్టత లేదన్నారు మల్లారెడ్డి. రాబోయే ఐదేళ్లలో రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలైనా చోటు చేసుకోవచ్చని, మళ్లీ తాను మంత్రిగా అదృష్టం వరించే అవకాశం కూడా లేకపోలేదని మల్లారెడ్డి అన్నారు.
మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? మల్లారెడ్డిని మళ్లీ మంత్రి పదవి ఏ విధంగా వరిస్తుంది? అనేది చర్చకు దారితీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా? లేక మల్లారెడ్డి కాంగ్రెస్ లో ఏమైనా చేరే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ నుంచి విజయం సాధించిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కు బీఆర్ఎస్ కేబినెట్ లో చోటు దక్కింది. అవే పరిణామాలు మరోసారి ఏమైనా తలెత్తుతాయా? అన్న చర్చ మొదలైంది.
Also Read : లోక్‌సభ ఎన్నికల రేసులో భట్టి విక్రమార్క భార్య నందిని.. గాంధీ భవన్‌లో కొనసాగుతున్న అప్లికేషన్ల స్వీకరణ