కర్నూలు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార తెలుగుదేశం పార్టీలో పార్లమెంటు సీటును కోట్ల సుర్యప్రకాశ్ రెడ్డికి కేటాయించనున్నారు. దీంతో ప్రతిపక్ష వైసీపీ నుండి తెలుగుదేశం గూటికి చేరుకున్న బుట్ట రేణుకకు ఈసారి సీటు దక్కని పరిస్థితి. ఈ క్రమంలో బుట్టా రేణుకకు పలు పార్టీల నుండి ఆహ్వానాలు అందుతున్నాయి. కర్నూలు ఎంపీ సీటును ఆఫర్ చేస్తున్నాయి. జనసేన తరుపున పోటీ చేయమంటూ ఇప్పటికే ఆ పార్టీ తరుపున నాదెండ్ల మనోహర్.. ఆమెకు ఆఫర్ చేసేందుకు ఆమెను కలిసినట్లు చెబుతున్నారు. అయితే జనసేనలోకి ఆమె వెళ్లే అవకాశం లేదని కూడా అంటున్నారు.
అలాగే బీజేపీ కర్నూలు ఎంపీ అభ్యర్థి రేసులో ఉన్న పార్థసారథి ఆమెను పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆ ఆఫర్‌ను బుట్టా రేణుక సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తుంది. అయితే తెలుగుదేశంలో ఆమెకు ఎమ్మెల్యే సీటు ఆఫర్ చేసినప్పటికీ ఆమె అందుకు నిరాకరించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే బుట్టా రేణుక మళ్లీ తను వదిలి వచ్చిన పార్టీలోకే మళ్లీ వెళ్లాలనే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
ఇఫ్పటికే జగన్ అపాయింట్‌మెంట్ తీసుకుందని, ఇవాళ(16 మార్చి 2019) ఏ సమయంలో అయినా జగన్‌ను కలిసే అవకాశం ఉంది. అయితే ఎన్నికలవేళ బుట్ట రేణుక ఏ నిర్ణయం తీసుకోబోతుందో అని కర్నూలు జిల్లాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది.