సీఎం రేవంత్ జాగ్రత్త.. మీ పక్కన భస్మాసురుడు చేరాడు- బీఆర్ఎస్ నేతలు వార్నింగ్

నమ్మకద్రోహం చేసిన నీ అంతుచూస్తా. నిన్ను భూస్థాపితం చేయడమే నా లక్ష్యం. రా చూసుకుందాం..

సీఎం రేవంత్ జాగ్రత్త.. మీ పక్కన భస్మాసురుడు చేరాడు- బీఆర్ఎస్ నేతలు వార్నింగ్

Rajaiah Thatikonda Fires On Kadiyam Srihari

Brs Party : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, వినయ్ భాస్కర్, ఇతర నేతలు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. కడియం శ్రీహరి టార్గెట్ గా బీఆర్ఎస్ నేతలు నిప్పులు చెరిగారు. తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. కడియం శ్రీహరి అహంకారానికి బ్రాండ్, అవినీతికి బ్రాండ్ అని మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ధ్వజమెత్తారు.

”వెన్నుపోటు రాజకీయాలకు బ్రాండ్. పచ్చటి చేల్లలో దొబ్బితిని వెచ్చగా ఉండే చోట పండే దొంగ కడియం శ్రీహరి. పంతులు తప్పు చేస్తే పిల్లలు రౌతులతో కొట్టారు.. ఈ ద్రోహికి ప్రజలు ఓట్లతో బుద్ది చెప్పాలి. ఇలాంటి ద్రోహి ప్రజాప్రతినిధి అయితే ప్రజలకు కీడు జరుగుతుంది. రాజకీయ భిక్ష పెట్టిన NTRకు పోటు పొడిచారు. నువ్వు నిజాయితీపరుడివి అయితే ఈరోజే రాజీనామా చెయ్యి. బీఫాం తెచ్చుకొని నిలబడాలి. నువ్వే నిలబడితే నీ బలం ఏంటో తెలుస్తుంది. దమ్ముంటే రా. దళిత ఉద్యమాన్ని చీల్చడానికి కూడా ప్యాకేజ్ తీసుకున్న చరిత్ర నీది” అని దాస్యం వినయ్ భాస్కర్ ఫైర్ అయ్యారు.

మీసం తిప్పి తొడగొట్టి కడియం శ్రీహరికి తాటికొండ రాజయ్య సవాల్..
నమ్మకద్రోహం చేసిన కడియం నీ అంతుచూస్తా. నిన్ను భూస్థాపితం చేయడమే నా లక్ష్యం. రా చూసుకుందాం.. నువ్వు రాజీనామా చేసి రా. ఇద్దరం పోటీ చేసి తేల్చుకుందాం. తెలుగు రాష్ట్రాలన్నీ మన ఇద్దరి కోసమే ఎదురు చూస్తున్నాయి. నాకు నేనుగా.. రాజకీయ ఆత్మహత్య చేసుకునేలా చేసిన దుర్మార్గుడు కడియం. రేవంత్ రెడ్డి అభయహస్తం అంటున్నాడు. కానీ కడియం శ్రీహరి లాంటి భస్మాసురుడు పక్కన చేరాడు జాగ్రత్త. నాకున్న పని కేవలం నిన్ను తొక్కుడే. దళిత ద్రోహి.. కల్నాయక్ కడియం శ్రీహరి. నమ్మకద్రోహి.. డిక్టేటర్.. గుంటనక్క. కడియం శ్రీహరిని ఇక్కడ తొక్కితే పాకిస్తాన్ లో తేలాలి.

Also Read : హైటెన్షన్ వైరు లాంటోడిని, టచ్ చేసి చూడు మాడిపోతావ్- కేసీఆర్‌కు సీఎం రేవంత్ వార్నింగ్