వరదలు జగన్ ప్రభుత్వం కుట్ర : నా ఇంటిని, రాజధానిని ముంచడానికే
కృష్ణా నది వరదలపై మాజీ సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా వరదలు ప్రభుత్వం ఉద్దేశపూరితంగా సృష్టించిన విపత్తు అని చంద్రబాబు ఆరోపించారు. కృష్ణా,

కృష్ణా నది వరదలపై మాజీ సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా వరదలు ప్రభుత్వం ఉద్దేశపూరితంగా సృష్టించిన విపత్తు అని చంద్రబాబు ఆరోపించారు. కృష్ణా,
కృష్ణా నది వరదలపై మాజీ సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా వరదలు ప్రభుత్వం ఉద్దేశపూరితంగా సృష్టించిన విపత్తు అని చంద్రబాబు ఆరోపించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వరద ప్రాంతాల్లో పర్యటించాను అని చెప్పారు. లంక గ్రామాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయన్నారు. వరద వచ్చే నాటికి ప్రాజెక్టులన్నీ ఖాళీగా ఉన్నాయని చంద్రబాబు చెప్పారు. ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజ్ కి నీరు రావాలంటే నాలుగున్నర రోజుల సమయం పడుతుందన్నారు. పైనుంచి వరద వస్తుందని తెలిసినా నీటిని వదల లేదు అన్నారు. వరదలను నియంత్రించే అవకాశం ఉన్నా.. ఫ్లడ్ మేనేజ్ మెంట్ చేయలేకపోయారని చంద్రబాబు ఆరోపించారు.
రాజధానిని ముంచడానికే వరదను తీసుకొచ్చారని ప్రభుత్వంపై మండిపడ్డారు. వరద పరిస్థితులపై సీఎం జగన్, మంత్రులు ఒక్క సమీక్ష కూడా చేయలేదన్నారు. నా ఇంటి చుట్టూ తిరగడానికి, డ్రోన్ తో హడావుడి చేయడానికే మంత్రులకు సమయం సరిపోయిందని విమర్శించారు. నా ఇంటిని ముంచే కుట్రతో ప్రజలను నిండా ముంచారని ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆల్మట్టి నుంచి నారాయణపూర్ కి వరద రావాలంటే 12 గంటలు.. నారాయణపూర్ నుంచి జూరాలకు రావాలంటే 30 గంటలు.. అక్కడి నుంచి శ్రీశైలానికి రావాలంటే 30 గంటలు, శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ కి 12 గంటలు, అక్కడి నుంచి ప్రకాశం బ్యారేజీకి 24 గంటలు పడుతుందని చంద్రబాబు వివరించారు. ఈ లెక్కలన్నీ తెలిసినా ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించిందన్నారు. ఆగస్టు 16 నుంచి 22వ తేదీ మధ్య ఫ్లడ్ మేనేజ్ మెంట్ సరిగా చేయలేదని చంద్రబాబు విమర్శలు చేశారు. సాగర్, పులిచింతలో నిల్వ నీటిని ఒకేసారి వదిలారని.. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వరదలను తీసుకొచ్చిందని చంద్రబాబు ఆరోపించారు.
Also Read : సీఎం జగన్ సంచలన నిర్ణయం : రాజధానిపై రెఫరెండం