టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను టీడీపీ చీఫ్ చంద్రబాబు పరామర్శించారు. పలు కేసుల్లో అరెస్ట్ అయిన చింతమనేని 67 రోజుల తర్వాత జైలు నుంచి బెయిల్ పై
టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను టీడీపీ చీఫ్ చంద్రబాబు పరామర్శించారు. పలు కేసుల్లో అరెస్ట్ అయిన చింతమనేని 67 రోజుల తర్వాత జైలు నుంచి బెయిల్ పై విడుదలైన సంగతి తెలిసిందే. సోమవారం(నవంబర్ 18,2019) పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో చింతమనేని ఇంటికి వెళ్లిన చంద్రబాబు.. ఆయనను పరామర్శించారు. చింతమనేని, ఆయన కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. తాను, పార్టీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
కాగా చంద్రబాబు రాకతో పశ్చిమగోదావరి జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. టీడీపీ నేతలను పోలీసులు ముందస్తు అరెస్ట్ లు చేశారు. చంద్రబాబు వస్తున్నారని తెలుసుకున్న టీడీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో చింతమనేని ఇంటికి చేరుకున్నాయి. టీడీపీ శ్రేణులకు చంద్రబాబు అభివాదం చేశారు.
జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. టీడీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలన్నారు. వేధింపులకు పాల్పడటం కరెక్ట్ కాదన్నారు. కార్యకర్తలకు తాను అండగా ఉంటానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎవరూ భయపడాల్సిన పని లేదని, ఆందోళన చెందొద్దని కోరారు.
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నారు. బెయిల్ రావడంతో శనివారం(నవంబర్ 16,2019) ఏలూరులోని జిల్లా జైలు నుండి విడుదలయ్యారు. సెప్టెంబర్ 11న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో చింతమనేని ప్రభాకర్ ను పెదపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. చింతమనేనిపై 68 కేసులు నమోదయ్యాయి. 18 కేసుల్లో చింతమనేనిని అరెస్టు చేశారు.