రాజ్యసభ ఎన్నికలు.. టీడీపీ పోటీపై చంద్రబాబు కీలక నిర్ణయం

రాజ్యసభ ఎన్నికల్లో పోటీ అంశాన్ని చంద్రబాబు వద్ద వారు ప్రస్తావించారు.

రాజ్యసభ ఎన్నికలు.. టీడీపీ పోటీపై చంద్రబాబు కీలక నిర్ణయం

Chandrababu Key Decision On Rajya Sabha Elections 2024

Updated On : February 14, 2024 / 6:49 PM IST

Rajya Sabha Elections : రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది టీడీపీ. చంద్రబాబుతో యనమల, నిమ్మల, అనగాని, గొట్టిపాటి రవికుమార్ భేటీ అయ్యారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ అంశాన్ని చంద్రబాబు వద్ద వారు ప్రస్తావించారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచన లేదని వారితో తేల్చి చెప్పారు చంద్రబాబు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.

పార్టీ సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్, రామానాయుడు.. ఈ నలుగురితో దాదాపు రెండున్నర గంటల పాటు చంద్రబాబు చర్చించారు. రాజ్యసభ ఎన్నికల్లో టీడీపీ పోటీపై తీవ్ర చర్చల తర్వాత చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికలకు దూరంగా ఉండాలని చంద్రబాబు నిర్ణయించారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇటువంటి ప్రయోగాలు వద్దని చంద్రబాబు నిర్ణయించారు. ఎట్టి పరిస్థితుల్లో పోటీ చేయకూడదని, మన ఫోకస్ అంతా కూడా రాబోయే అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలపైనే ఉండాలని నేతలకు తేల్చి చెప్పారు చంద్రబాబు.

Also Read : ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌.. వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యల వెనుక పక్కా ప్లాన్?

తన పార్టీ కీలక నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు చంద్రబాబు. లాభనష్టాలు కూడా బేరీజు వేశారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తే.. అధికార పార్టీకి చెందిన 20మందికిపైగా ఎమ్మెల్యేలు మద్దతివ్వాల్సి ఉంటుంది. అప్పుడే టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో 10 నుంచి 15 రోజులు.. రాజ్యసభ ఎన్నికలపైనే ఫోకస్ అంతా పెట్టాల్సి వస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈ పని వల్ల సార్వత్రిక ఎన్నికల్లో మనం వెనుకబడే ప్రమాదం ఉందని నేతలతో చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది.

Also Read : కృష్ణా జిల్లాలో టీడీపీ, వైసీపీ మధ్య హోరాహోరీ.. అభ్యర్థులు వీళ్లే?