ఆమంచి ఎఫెక్ట్ : కరణంని రంగంలోకి దింపిన చంద్రబాబు

ప్రకాశం: ఆమంచి కృష్ణమోహన్ ఎపిసోడ్ చీరాల టీడీపీలో కలకలం రేపింది. ఆమంచి రాజీనామాతో సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు. మరింత నష్టం జరక్కుండా చర్యలు చేపట్టారు.

  • Publish Date - February 13, 2019 / 10:53 AM IST

ప్రకాశం: ఆమంచి కృష్ణమోహన్ ఎపిసోడ్ చీరాల టీడీపీలో కలకలం రేపింది. ఆమంచి రాజీనామాతో సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు. మరింత నష్టం జరక్కుండా చర్యలు చేపట్టారు.

ప్రకాశం: ఆమంచి కృష్ణమోహన్ ఎపిసోడ్ చీరాల టీడీపీలో కలకలం రేపింది. ఆమంచి రాజీనామాతో సీఎం చంద్రబాబు అలర్ట్ అయ్యారు. మరింత నష్టం జరక్కుండా చర్యలు చేపట్టారు. కరణం  బలరాంకు చీరాల బాధ్యతలు అప్పగించారు చంద్రబాబు. వెంటనే చీరాల టీడీపీ నేతల సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని.. ఆమంచితో పాటు నేతలు, కార్యకర్తలు వెళ్లకుండా చూడాలని  చంద్రబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది. అధినేత ఆదేశాలతో కరణం బలరాం చీరాలకు బయలుదేరి వెళ్లారు. స్థానిక నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు. పార్టీ మారకుండా  వారికి నచ్చ చెప్పనున్నారు. ఆమంచి వైసీపీలో చేరడంపై చీరాల టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. చీరాలలో ఆమంచి ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.

 

వైసీపీలో చేరేందుకు తాను ఎలాంటి షరతులు పెట్టలేదని టీడీపీకి గుడ్‌బై చెప్పిన చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ అన్నారు. టీడీపీకి రాజీనామా చేసిన అనంతరం… లోటస్‌పాండ్‌లో  జగన్‌ను కలిశారాయన. ఒంగోలులో జరిగే సభలో ఆమంచి వైసీపీలో చేరనున్నారు. 2019, ఫిబ్రవరి 13వ తేదీ ఉదయం టీడీపీ అధినేతకు చంద్రబాబుకు తన రాజీనామా లేఖను పంపించారు  ఆమంచి కృష్ణమోహన్. చీరాల నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో, ప్రభుత్వ కార్యకలాపాల్లో పార్టీ, ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేని కొన్ని శక్తుల ప్రమేయాన్ని వ్యతిరేకిస్తూ,  టీడీపీకి రాజీనామా చేస్తున్నట్టు ఆమంచి లేఖలో తెలిపారు.

 

రాజకీయపరమైన అంశాల గురించే జగన్‌తో చర్చించాను అని ఆమంచి తెలిపారు. తన అనుచరులు కూడా టీడీపీలో కొనసాగొద్దని తనతో అన్నట్టు ఆమంచి చెప్పారు. సామాన్యులకు, ఎమ్మెల్యేలకు  చంద్రబాబు కలిసే అవకాశం ఇవ్వరని ఆమంచి విమర్శలు చేశారు. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ తనను పార్టీలోకి ఏనాడూ ఆహ్వానించలేదన్నారు. ఇండిపెండెంట్‌గా గెలిచాను కాబట్టి ఎమ్మెల్యే  పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆమంచి స్పష్టం చేశారు.