కరోనా సాకు చూపి ఎన్నికలు వాయిదా వేస్తారా, చంద్రబాబు నియమించిన ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ విచక్షణ కోల్పోయారు
ఏపీ సీఎం జగన్ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్ తీరుని జగన్ తప్పు పట్టారు. కరోనా సాకు చూపి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా

ఏపీ సీఎం జగన్ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్ తీరుని జగన్ తప్పు పట్టారు. కరోనా సాకు చూపి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
ఏపీ సీఎం జగన్… ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఫైర్ అయ్యారు. ఎన్నికల కమిషనర్ తీరుని జగన్ తీవ్రంగా తప్పు పట్టారు. ఎన్నికల కమిషనర్ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, చంద్రబాబుకి అనుకూలంగా పని చేస్తున్నారని, ప్రభుత్వంపై వివక్ష చూపిస్తున్నారని జగన్ మండిపడ్డారు. కరోనా సాకు చూపి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తారా? అని సీఎం జగన్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. చంద్రబాబు నియమించిన అధికారి అని జగన్ చెప్పారు. చంద్రబాబు, రమేష్ కుమార్ సామాజిక వర్గం ఒక్కటే అన్నారు. రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయన్న సీఎం జగన్, రమేష్ కుమార్ విచక్షణ కోల్పోయినట్టు ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ వివక్ష చూపారని ఆరోపించారు.
కరోనా వైరస్ కారణంగా స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంపై సీఎం జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. రమేష్ కుమార్ పై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆదివారం(మార్చి 15,2020) మధ్యాహ్నం సీఎం జగన్ ఏపీ గవర్నర్ ను కలిశారు. ఈసీపై ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. ఎన్నికల కమిషనర్ పై ఓ రేంజ్ లో సీఎం జగన్ మండిపడ్డారు.
తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చంద్రబాబు ఈసీ పదవిలోకి తెచ్చుకున్నారు:
రమేష్ కుమార్ ఇలా వ్యవహరించడం ఎక్కడి నుంచి వచ్చిందని సీఎం జగన్ ప్రశ్నించారు. తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చంద్రబాబు ఈసీ పదవిలోకి తెచ్చుకున్నారని ఆరోపించారు. కలెక్టర్లు, అధికారులను ఎన్నికల కమిషనర్ బదిలీ చేయడం ఏ రకంగా కరెక్ట్ అని నిలదీశారు. కరోనా వైరస్ సాకు చూపి ఎన్నికలు వాయిదా వేస్తున్నామని ప్రకటించడం చాలా ఆశ్చర్యంగా ఉందన్నారు. కరోనా వల్ల ఎన్నికలు వాయిదా వేసిన ఈసీ రమేష్ కుమార్.. కనీసం ఎవరినీ అడగలేదు, సూచనలు, సలహాలు తీసుకోలేదని జగన్ వాపోయారు. ఎన్నికలు వాయిదా వేసేటప్పుడు సంప్రదింపులు చేయాలి కదా అని జగన్ అన్నారు. అధికారులను బదిలీ చేసే అధికారం ఎన్నికల కమిషనర్ కు ఎక్కడిదని జగన్ నిలదీశారు. అధికారం 151 సీట్లున్న జగన్ దా? ఈసీదా..? అని సీఎం అడిగారు.
అన్ని నిర్ణయాలు మీరే తీసుకుంటే, ఇక సీఎంగా నేనెందుకు?
ఏ ప్రభుత్వ అధికారి అయినా కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా వ్యవహరించాలన్న సీఎం జగన్.. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం వివక్ష చూపించారని ఆరోపించారు. అన్ని నిర్ణయాలు మీరే తీసుకుంటే ఇక ఎన్నికలు ఎందుకు, ప్రభుత్వాలు ఎందుకు, సీఎంగా నేనెందుకు అని జగన్ ధ్వజమెత్తారు. ప్రజల చేత ఎన్నికైన సీఎం కంటే, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు ఎక్కువ అధికారాలు ఉంటాయా? అని జగన్ ప్రశ్నించారు. 2వేలకు పైగా ఎంపీటీసీలు వైసీపీ ఏకగ్రీవంగా గెల్చుకుందని, అది జీర్ణించుకోలేకనే ఎన్నికలు వాయిదా వేశారని సీఎం జగన్ ఆరోపించారు. ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్.. చంద్రబాబుకి అనుకూలంగా వ్యవహరించారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.