ఆర్టీసీ..కేంద్రం వాటాపై కోర్టుకు వెళుతాం – సీఎం కేసీఆర్

  • Published By: madhu ,Published On : November 28, 2019 / 03:47 PM IST
ఆర్టీసీ..కేంద్రం వాటాపై కోర్టుకు వెళుతాం – సీఎం కేసీఆర్

Updated On : November 28, 2019 / 3:47 PM IST

ఆర్టీసీలో కేంద్రం వాటా ఉందని కొందరు నేతలు చెబుతున్నారని..దీనిపై పక్కాగా లెక్క కడుతామన్నారు సీఎం కేసీఆర్. కేంద్రంపైనే కోర్టుకు వెళుతామని స్పష్టం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు కేంద్రం ఏకాణా ఇచ్చింది లేదన్నారు. 31 శాతం వాటా ప్రకారం…ప్రభుత్వాల పెట్టుడుకు కేంద్రం…రూ. 22 వేల కోట్ల రూపాయలు తేలుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వానికి నోటీసు అందిస్తామన్నారు.

2019, నవంబర్ 28వ తేదీ మధ్యాహ్నం తెలంగాణ కేబినెట్ భేటీ జరిగింది. సుమారు..ఐదున్నర గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. ఆర్టీసీ సమ్మెపై చర్చించి..కార్మికులకు తీపి కబురు అందించారు. నవంబర్ 29వ తేదీ శుక్రవారం నుంచి విధుల్లోకి హాజరు కావచ్చొని ప్రకటించారు. కార్మికులను మోసం చేసింది యూనియన్లు, ప్రతిపక్షాలేనని మండిపడ్డారు. యూనియన్ నాయకులు, ప్రతిపక్షాలు కాపాడుతాయా ? అని సూటిగా ప్రశ్నించారు. ప్రైవేటీకరిస్తున్నామని..ఇలాంటి ఎన్నో కామెంట్స్ చేశారన్నారు. కేంద్రం..బాధ్యత వహించాలని..రూ. 5 వేల కోట్లు ఇవ్వాలని అంటే..ఇస్తారా ? బీజేపీ నాయకులు ఈ డబ్బులు తెస్తారా ? అని ప్రశ్నించారు.

ఇంత రాజకీయం ఉంటుందా ? అని నిలదీశారు. ఇక్కడ కేంద్ర మంత్రి, ముగ్గురు ఎంపీలున్నారని, రవాణా చట్టానికి వీరు ఓటేశారని..ఇక్కడకు వచ్చి వేరే విషయాలు చెబుతారని బీజేపీని ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీ పాలించే రాష్ట్రాల్లో ఆర్టీసీ విలీనం చేశారా అని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ఒక అర్థం..పర్థం లేకుండా ప్రతిపక్షాలు వ్యాఖ్యానిస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికుల బతుకులు రోడ్డున పడేడటట్లు చేశారని, అన్ని అబద్ధాలు చెప్పారని..వీరి మాటలు నమ్మవద్దని తాను సూచించినా..వారు పట్టించుకోలేదని కార్మికులనుద్దేశించి చెప్పారు సీఎం కేసీఆర్.
Read More : సోమవారం నుంచి ఆర్టీసీ ఛార్జీలు పెంపు