సై అంటే సై : అమరావతి వీధుల్లో కొట్టుకున్న టీడీపీ నేతలు

టీడీపీ నేతలు సై అంటే సై అనుకున్నారు. అమరావతి వీధుల్లో నేతలు కొట్టుకున్నారు.

  • Publish Date - February 19, 2019 / 08:04 AM IST

టీడీపీ నేతలు సై అంటే సై అనుకున్నారు. అమరావతి వీధుల్లో నేతలు కొట్టుకున్నారు.

అమరావతి : టీడీపీ నేతలు సై అంటే సై అనుకున్నారు. అమరావతి వీధుల్లో నేతలు కొట్టుకున్నారు. ఒకరిపైమరొకరు దాడి చేసుకున్నారు. పరస్పరం దూషించుకున్నారు. తుళ్లూరు మండలం వెంకటపాలెంలో టీడీపీలోని ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చంద్రబాబు మళ్లీ సీఎం కావాలంటూ జడ్పీ వైస్‌ చైర్మన్‌ పూర్ణచందర్‌రావు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అయితే.. స్థానిక ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్‌ పాదయాత్రకు దూరంగా ఉండడంతో.. ఆయన వర్గీయులు పాదయాత్రను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

పూర్ణచందర్‌రావు సమాచారం ఇవ్వకుండా పాదయాత్ర చేపడుతున్నారని ఎమ్మెల్యే శ్రవణ్‌కుమార్‌ వర్గీయులు పాదయాత్రను అడ్డుకున్నారు. ఇదివరకే శ్రావణ్ కుమార్, పూర్ణచందర్ రావుల మధ్య విభేదాలున్నట్లు తెలుస్తోంది. శ్రావణ్ కుమార్ కు ఈసారి టికెట్ ఇవ్వదని పూర్ణచందర్ రావు చెప్పుతున్నాడని శ్రవన్ కుమార్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. 

Read Also : కేసీఆర్ తో కలిసి జగన్ కుట్రలు : చంద్రబాబు

Read Also : మోడీ మీటింగ్ కు మా క్యాంపస్ ఇవ్వం : ఆంధ్రా వర్శిటీ