పాలిటిక్స్‌లో గబ్బర్ సింగా.. రబ్బర్ సింగా? : సీఐ ఉద్యోగానికి మాధవ్ రాజీనామా
ఎంపీ జేసీకి సవాల్ చేసి.. మీసం మెలేసి.. తొడగొట్టిన సీఐ గోరంట్ల మాధవ్.. ఉద్యోగానికి ఏకంగా రాజీనామానే చేసేశారు. పోలీసులను జేసీ దివాకర్ రెడ్డి తిట్టిన తర్వాత వాటికి అనంతపురం జిల్లా కదిరి అర్బన్ సీఐ మాధవ్ ఇచ్చిన కౌంటర్ వైరల్ అయ్యింది.
ఎంపీ జేసీకి సవాల్ చేసి.. మీసం మెలేసి.. తొడగొట్టిన సీఐ గోరంట్ల మాధవ్.. ఉద్యోగానికి ఏకంగా రాజీనామానే చేసేశారు. పోలీసులను జేసీ దివాకర్ రెడ్డి తిట్టిన తర్వాత వాటికి అనంతపురం జిల్లా కదిరి అర్బన్ సీఐ మాధవ్ ఇచ్చిన కౌంటర్ వైరల్ అయ్యింది.
అనంతపురం: ఎంపీ జేసీకి సవాల్ చేసి.. మీసం మెలేసి.. తొడగొట్టిన సీఐ గోరంట్ల మాధవ్.. ఉద్యోగానికి ఏకంగా రాజీనామానే చేసేశారు. పోలీసులను జేసీ దివాకర్ రెడ్డి తిట్టిన తర్వాత వాటికి అనంతపురం జిల్లా కదిరి అర్బన్ సీఐ మాధవ్ ఇచ్చిన కౌంటర్ వైరల్ అయ్యింది. నాలుగో సింహం అంటూ ఆకాశానికెత్తేసింది సోషల్ మీడియా. అప్పటి నుంచి సీఐ మాధవ్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకేసుకొచ్చినట్లు ప్రచారం జరిగింది. మాధవ్‌ను పార్టీలోకి ఆహ్వానించి.. పోలీస్ డిపార్ట్‌మెంట్ నుంచి జేసీకి చెక్ పెట్టాలనే వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే మాధవ్‌ను పార్టీలోకి ఆహ్వానించింది. ఎమ్మెల్యే లేదా ఎంపీ టికెట్ ఇవ్వటానికి కూడా సిద్ధం అయినట్లు వార్తలు వచ్చాయి. సరిగ్గా ఇదే సమయంలో సీఐ మాధవ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావటం కన్ఫామ్ అని తేలిపోయింది.
పాలిటిక్స్‌లో గబ్బరా.. రబ్బరా?
ఉద్యోగానికి రాజీనామా చేశారో లేదో వెంటనే రాజకీయాలు ఎంట్రీ అయిపోయాయి. ఇప్పటి వరకు ఉన్న హైప్ కాస్తా ఇప్పుడు యూటర్న్ తీసుకుంది. గబ్బర్ సింగ్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీర్తిస్తుంటే.. పాలిటిక్స్‌లో మాత్రం రబ్బర్ సింగే అంటూ టీడీపీ కౌంటర్ ఎటాక్ చేస్తోంది. హోదాలో ఉండి మాట్లాడితే ఒకలా ఉంటుందని.. అదే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వ్యూహాలు, దాడులు మరోలా ఉంటాయని అంటున్నారు రాజకీయ నేతలు. ఇన్నాళ్లు నాలుగో సింహం, గబ్బర్ సింగ్ అంటూ వైఎస్ఆర్ నేతలు వెనకేసుకొచ్చారని.. సీఐ హోదాలో ఉన్నాడు కాబట్టి ఓపిక పట్టాం అని.. పోలీస్ శాఖ గౌరవాన్ని కాపాడేందుకు నోరెత్తలేదని అంటోంది టీడీపీ. ఇప్పుడు పొలిటికల్ కండువా కప్పుకున్నాడు కాబట్టి.. ఎవరైనా ఒకటే అంటోంది. పోలీస్ శాఖలోని గబ్బర్ సింగ్.. రాజకీయాల్లో రబ్బర్ సింగ్ కావటం ఖాయం అని.. మా వ్యూహాలు మాకు ఉన్నాయంటూ చురకలు అంటోంది టీడీపీ.
త్వరలో రాజీనామాకు ఆమోదం:
అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి మీసం తిప్పి మరీ సవాల్ విసిరి వార్తల్లోకి ఎక్కిన కదిరి అర్బన్ సీఐ గోరంట్ల మాధవ్.. తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. రాత్రి తన రాజీనామా లేఖను కదిరి డీఎస్పీ లక్ష్మికి అందించినట్లు తెలుస్తోంది. 22ఏళ్లుగా పోలీసు శాఖలో ఉన్న మాధవ్‌కు దూకుడు ఎక్కువనే పేరుంది. ఆయనను గబ్బర్ సింగ్ అని పిలుస్తారు. పోలీసు అధికారుల సంఘం నాయకుడిగా.. జేసీ దివాకర్ రెడ్డికి సవాలు విసిరి వార్తల్లోకి వచ్చారు. త్వరలో ఆయన వైసీపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హిందూపురం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా అవకాశం ఇస్తామన్న హామీ మేరకే.. ఆయన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
