టీడీపీకే లేదు : ఢిల్లీలో TRS ఆఫీస్

ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్న ఎంపీల ఇళ్లళ్లోనే వారి పార్టీ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. టీడీపీకి కూడా ఇప్పటి వరకు ఢిల్లీలో పార్టీ ఆఫీస్ లేకపోవటం విశేషం. ఆప్ కూడా పార్టీ ఆఫీస్ లేదు.

  • Publish Date - December 28, 2018 / 08:09 AM IST

ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్న ఎంపీల ఇళ్లళ్లోనే వారి పార్టీ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. టీడీపీకి కూడా ఇప్పటి వరకు ఢిల్లీలో పార్టీ ఆఫీస్ లేకపోవటం విశేషం. ఆప్ కూడా పార్టీ ఆఫీస్ లేదు.

ఢిల్లీ : దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా టీఆర్ఎస్ ముందడుగు వేస్తోంది. ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం నిర్మించేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం కేటాయించే స్థలంలో కార్యాలయం నిర్మించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టి సారించారు. ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశ రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకురాబోతున్నారు. కేసీఆర్ దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. అందుకనుగుణంగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈమేరకు ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయం నిర్మించేందుకు సిద్ధమయ్యారు.
ప్రభుత్వ స్థలంలో కార్యాలయ నిర్మాణం
దేశ రాజధానిలో తొలిసారి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. నిబంధనల ప్రకారం టీఆర్ఎస్ కు వెయ్యి గజాల స్థలాన్ని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. అదే స్థలంలో పార్టీ ఆఫీస్ నిర్మించనున్నారు. కేంద్రం 2, 3 స్థలాలను చూపించింది. ఇందులో ఏది బాగుంటే దాన్ని కేసీఆర్ ఆమోదించనున్నారు. స్వయంగా పరిశీలించి ఈ నిర్ణయం తీసుకుంటారు. సంక్రాంతి పండుగ తర్వాత ఆఫీస్ నిర్మాణం ప్రారంభం కాబోతున్నది. 2, 3 నెలల్లోనే  పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం సన్నాహాలు చేస్తున్న కేసీఆర్.. ఢిల్లీ వేదికగా మరో అడుగు వేశారు.
ఢిల్లీలో ప్రాంతీయ పార్టీకి కార్యాలయం లేదు
ఇప్పటివరకు ఢిల్లీలో ఏ ప్రాంతీయ పార్టీకి పార్టీ ఆఫీస్ లేదు. ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్న ఎంపీల ఇళ్లళ్లోనే వారి పార్టీ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. టీడీపీకి కూడా ఇప్పటి వరకు ఢిల్లీలో పార్టీ ఆఫీస్ లేకపోవటం విశేషం. ఆప్ కూడా పార్టీ ఆఫీస్ లేదు. ఇప్పటి వరకు కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ పార్టీలకు మాత్రమే పార్టీ కార్యాలయాలున్నాయి. 
ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా అడుగులు
ఫెడరల్ ఫ్రంట్ అంటూ దేశ రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకరాబోతున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఆ రాష్ట్రాల సీఎంలతో చర్చిస్తున్నారు. ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, ప.బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో కేసీఆర్ చర్చలు జరిపారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంపై చర్చించారు.  మరికొన్ని రాష్ట్రాల సీఎంలతో, ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. కాంగ్రెస్, బీజేపీ యేతర ఫ్రంట్ కేంద్రంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర హక్కులను ముందంజలో ఉంచే విధంగా ఫెడరల్ ఫ్రంట్ ఉంటుందని కేసీఆర్ తెలిపారు. అనేక రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి.
దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ కీలక పాత్ర.. 
దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించాలని కేసీఆర్ భావిస్తున్నారు. 2019 ఎన్నికల ముందే కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేసి.. ఢిల్లీ వేదికగా రాజకీయ పార్టీలతో సమావేశాలు, చర్చలు జరిపి దేశ రాజకీయాల్లో ఎలాంటి పాత్ర పోషించాలనేదానిపై  సమాలోచనలు చేస్తున్నారు. రాజధానిలో ఏర్పాటు చేయబోయే పార్టీ కార్యాలయం నుంచి దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్నారు. దేశం దృష్టిని ఆకర్షించే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు