కరోనా వైరస్ : ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు ? సీఎం కేసీఆర్ సీరియస్

తెలంగాణాలో కరోనా వైరస్ కట్టడి చేసేందుకు సీఎం కేసీఆర్ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. లాక్ డౌన్ ప్రకటించినా…ప్రజలు వినిపించుకోకపోవడంతో తీవ్రంగా రెస్పాన్ అయ్యారు. ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు ? వారి వారి నియోజకవర్గాలకు వెంటనే వెళ్లాలి..గ్రేటర్ (హైదరాబాద్) లోని కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు ? అంటూ ప్రశ్నించారు సీఎం కేసీఆర్.
ప్రజాప్రతినిధులందరూ వెంటనే రంగంలోకి పోలీసులతో సమన్వయం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు రోడ్లపైకి వచ్చి నియంత్రిస్తున్నారు..ప్రజాప్రతినిధులు ఏమైపోయారు ? అంటూ ప్రశ్నించారు. ప్రతి చెక్ పోస్టు వద్ద ప్రజాప్రతినిధులు ఉండాలన్నారు. ఇలాంటి సమయాల్లో తమ వెంట ఉన్నారా ? లేదా అని ప్రజలు గమనిస్తారని వెల్లడించారు. ప్రజల కోసం పనిచేయాలి..జిల్లా హెడ్ క్వార్టర్స్ కు వెంటనే వెళ్లాలని, వారి వారి నియోజకవర్గాల్లోకి వెళ్లాలని సూచించారు. కొంతమంది మంత్రులకు ఇందులో మినహాయింపు ఉంటుందని తెలిపారు.
2020, మార్చి 24వ తేదీ మంగళవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్య, ఆరోగ్య, పోలీసు, పౌరసరఫరాలు, ఆర్థిక శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమావేశం అనంతరం జిల్లాల కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించారు.
గ్రామాల్లో నియమించిన స్టాడింగ్ కమిటీలో..8 లక్షల 20 వేల 727 మంది సభ్యులున్నారని విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. వీరందరినీ క్రియాసభ్యులుగా చేయాలని, ఏ ఊరు సర్పంచ్..ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్ ఛైర్మన్, ఎమ్మెల్యే, ఇతర వారంతా వెంటనే రంగంలోకి దిగాలని సూచించారు. పోలీసులు ఎలా పనిచేస్తున్నారో..అలాగే పనిచేయాలన్నారు.
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది..అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను తు.చ.తప్పకుండా పాటించాలన్నారు. ఇది ప్రత్యేక పరిస్థితి..మనమంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. కానీ ప్రజలు పట్టించుకోకపోతే..24 గంటల పాటు కర్ఫ్యూ విధించడం..కనిపిస్తే కాల్చివేత ఆర్డర్స్ జారీ చేయడం అవసరమైతే..ఆర్మీని దింపుతాం…అమెరికా సైతం ఆర్మీని దింపిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.