ajit pawar
Maharashtra Politics: మహారాష్ట్ర విపక్ష నేత అజిత్ పవార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముగ్గురు పిల్లలున్న ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. మహారాష్ట్ర సీఎం పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్న అజిత్ పవార్.. ఆ కుర్చీని దక్కించుకునేందుకు భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ముగ్గురు పిల్లలపై వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Telangana Politics: మే 7న తెలంగాణకు మాయావతి.. బీఎస్పీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో భారీ సభ
కొద్ది రోజుల క్రితమే చైనాను వెనక్కి నెట్టి అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశంగా భారతదేశం రికార్డ్ సాధించింది. అయితే దేశంలో అంతకంతకూ పెరుగుతున్న జనాభా ఆందోళన కలిగిస్తోందని అజిత్ పవార్ అన్నారు. ఈ విషయాన్ని మనమంతా సీరియస్‌గా తీసుకోవాలని అన్న ఆయన.. పిల్లలు భగవంతుడి అనుగ్రహంగా ఏ మతం వారైనా విశ్వసించరాదని, భగవంతుడి అనుగ్రహం వల్ల పిల్లలు ఎలా పుడతారు? అని ప్రశ్నించారు. తల్లితండ్రులకు మొదటి సంతానం కలిగి, ఆ తర్వాత రెండోసారి కాన్పులో కవలలు పుడితే, ఆ తల్లిదండ్రులను తప్పుపట్టరాదని అజిత్ పవార్ అన్నారు.
Karnataka Polls: లింగాయత్ సీఎం అవినీతిపరుడంటూ రాజకీయ దుమారం లేపిన సిద్ధరామయ్య
ఇక ఈ ముగ్గురు పిల్లల ప్రతిపాదనను మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ హయాంలోని సందర్భాల్ని గుర్తు చేశారు. ముగ్గురు పిల్లలున్న ఎమ్మెల్యేలపై విలాస్‌రావు దేశ్‌ముఖ్ అనర్హత వేటు వేసినట్టు అజిత్ పవార్ చెప్పుకొచ్చారు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే అధికారం కేంద్రానికి ఉందని, ఆ అధికారం ఉపయోగించి ముగ్గురు పిల్లలున్న ఎంపీలు, ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని అజిత్ పవార్ సూచించారు.