Karnataka Polls: లింగాయత్ సీఎం అవినీతిపరుడంటూ రాజకీయ దుమారం లేపిన సిద్ధరామయ్య

గతంలో బ్రాహ్మణ వర్గాన్ని కూడా సిద్ధరామయ్య అవమానించారని బొమ్మై మండిపడ్డారు. అంతేకాదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లింగాయత్‌లను, వీరశైవులను విడదీసే ప్రయత్నం చేశారని సిద్దును విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, ప్రజలే ఆయనకు గుణపాఠం నేర్పుతారని బొమ్మై అన్నారు

Karnataka Polls: లింగాయత్ సీఎం అవినీతిపరుడంటూ రాజకీయ దుమారం లేపిన సిద్ధరామయ్య

Siddaramaiah

Updated On : April 24, 2023 / 4:04 PM IST

Karnataka Polls: రాజకీయాలంటేనే ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఉద్దేశపూర్వకంగానే, నోరుజారో నేతలు చేసే వ్యాఖ్యలు పెద్ద పెద్ద వివాదాలకే దారి తీస్తుంటాయి. ఒక్కోసారి అవే ఎన్నికల ఫలితాలను నిర్ణయించే వరకు వెళ్తాయి. మరో 20 రోజుల్లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇప్పటి వరకు జరిగిన రాజకీయ కాంట్రవర్సీలో ఎక్కువ భారతీయ జనతా పార్టీనే చిక్కుతోంది. కాగా, తాజాగా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టివేసింది.

Tamil Nadu: ఇక నుంచి పెళ్లిల్లలో కూడా మద్యం సరఫరా చేయొచ్చు.. ప్రత్యేక లిక్కర్ పాలసీ తీసుకొచ్చిన ప్రభుత్వం

ఈ మధ్యే ఒక జాతీయ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనన సిద్ధరామయ్య.. అధికారంలోకి వచ్చాక లింగాయత్‌ వర్గానికి చెందిన నేతకే సీఎంగా అవకాశం ఇస్తామన్న బీజేపీ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారంటూ ప్రశ్నించగా.. ‘‘లింగాయత్‌ సీఎం అవినీతి పరుడు. ఇప్పటికే ఒక లింగాయత్‌ ముఖ్యమంత్రి ఉన్నాడు. ఆయన పాలనంతా అవినీతికి ఆలవాలం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతే కనిపిస్తోంది’’ అని సమాధానం ఇచ్చారు. అంతే లింగాయత్ నాయకులు, సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సీఎం బసవరాజు బొమ్మై లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అయితే సిద్ధరామాయ్య వ్యాఖ్యలు మొత్తం లింగాయత్‌ సమాజాన్ని ఉద్దేశించి చేసినవేనని, జాతి మొత్తాన్నీ ఆయన అవమానించారని బొమ్మై మండిపడ్డారు.

Telangana Politics: మే 7న తెలంగాణకు మాయావతి.. బీఎస్పీ ఆధ్వర్యంలో హైదరాబాద్‭లో భారీ సభ

గతంలో బ్రాహ్మణ వర్గాన్ని కూడా సిద్ధరామయ్య అవమానించారని బొమ్మై మండిపడ్డారు. అంతేకాదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లింగాయత్‌లను, వీరశైవులను విడదీసే ప్రయత్నం చేశారని సిద్దును విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి అయి ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని, ప్రజలే ఆయనకు గుణపాఠం నేర్పుతారని బొమ్మై అన్నారు. అయితే తాను మొత్తం లింగాయత్‌ సమాజాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించలేదని, కేవలం బొమ్మైని ఉద్దేశించే అవినీతి వ్యాఖ్యలు చేసినట్టు సిద్ధరామయ్య తర్వాత వివరణ ఇచ్చుకున్నారు.